సంపూ.. ఆ భ్రమల్లోకి వెళ్తే కష్టం

సంపూ.. ఆ భ్రమల్లోకి వెళ్తే కష్టం

తనకు తాను బర్నింగ్ స్టార్ అనే బిరుదు ఇచ్చుకుని రంగంలోకి దిగాడు సంపూ. ముందు ఇదంతా అతిగా, కామెడీగా అనిపించినా.. అనుకోకుండా పాపులారిటీ సంపాదించి జనాలకు చేరువయ్యాడు సంపూ. అతడి తొలి సినిమా ‘హృదయ కాలేయం’ సర్ప్రైజ్ హిట్టయింది. మధ్యలో కొన్ని వ్యర్థ ప్రయత్నాలు చేసినా.. చాలా కాలం తర్వాత అతడి నుంచి వచ్చిన ‘కొబ్బరి మట్ట’ మాత్రం మంచి విజయమే సాధించింది.

అసలు విడుదలే కాదనుకున్న ఈ చిత్రం మొదలైన నాలుగేళ్ల తర్వాత అన్ని అడ్డంకులనూ దాటుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు ప్రమోషన్ చక్కగా చేయడం, సంపూతో పాటు నిర్మాత మీద ప్రేక్షకుల్లో ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ కూడా ఉండటం కలిసొచ్చింది. సినిమాలో పెద్ద విషయం లేకపోయినా.. వెండి తెర మీద జబర్దస్త్ ప్రోగ్రాం చూస్తున్నట్లు అనిపించినా.. జనాలు ఓకే అనుకున్నారు. పాజిటివ్‌గానే మాట్లాడారు. సినిమా దాని స్థాయిలో అది బాగానే ఆడింది.

ఐతే ఈ సినిమా విజయం చూసుకుని మళ్లీ అదే టీం ఇంకో సినిమా చేయడానికి రెడీ అవుతోంది. మళ్లీ ‘హృదయ కాాలేయం’, ‘కొబ్బరిమట్ట’ తరహాలోనే సెటైరికల్ మూవీ చేయబోతున్నారట. కానీ ‘హృదయ కాలేయం’ ఆడిందని.. అదే స్టయిల్లో అతి జోడించి సంపూతో మంచు విష్ణు ‘సింగం 123’ తీస్తే అదెలా బోల్తా కొట్టిందో గుర్తుంచుకోవాలి. ప్రతిసారీ సెటైరికల్ మూవీస్ ఆడేస్తాయనేమీ లేదు.

నిజానికి ‘కొబ్బరిమట్ట’ మరీ ముతకగా అనిపించినా.. కొన్ని నవ్వులతో సంతృప్తి పడిపోయారు. దీనికి వేరే ఫ్యాక్టర్స్ కూడా కలిసొచ్చాయి. అలాగని మళ్లీ అలాంటి సినిమానే ట్రై చేస్తే కష్టం. ఒకప్పుడు స్పూఫులు, పేరడీలతో అల్లరి నరేష్ సినిమాలు చేస్తుంటే బాగానే ఆదరించారు. కానీ ‘సుడిగాడు’తో అతను ఒకే టికెట్ మీద చాలా పేరడీలు, స్పూఫులు చూపించేశాడు. దీంతో జనాలకు ఆ తర్వాత మొహం మొత్తేసింది. తర్వాత అతడి సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సంపూ కూడా జాగ్రత్తగా అడుగులేయాలి. మళ్లీ చేసిందే చేస్తా అంటే ఎదురు దెబ్బ తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English