ఆ హీరో మోడీ భజన ఆపడా?

ఆ హీరో మోడీ భజన ఆపడా?

అధికారంలో ఉన్న వాళ్లకు సినిమా వాళ్లు భజన చేయడం మామూలే. కొందరు పరోక్ష మద్దతు ప్రకటిస్తారు. ప్రభుత్వాధినేతల గురించి పాజిలివ్ వ్యాఖ్యలు చేస్తుంటారు. కొందరు ఎక్కడా వ్యతిరేకత కనిపించకుండా చూసుకుంటారు. కొందరు మాత్రం ఓపెన్‌గా మద్దతు ప్రకటిస్తారు.

ఇంకొందరైతే అదే పనిగా భజన మొదలుపెట్టేస్తారు. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్‌ని చివరి కేటగిరీలోకే చేర్చేశారు జనాలు. అతను నరేంద్ర మోడీ జీవిత కథతో సినిమా కూడా చేసేశాడు. నటుడిగా మంచి గుర్తింపు ఉన్న అతను ఈ పాత్ర చేయడం.. సినిమా అంతటా మోడీని దైవాంశ సంభూతుడి లాగా చూపించడం చాలామందికి రుచించలేదు. మోడీని ఇష్టపడేవాళ్లకు కూడా ఈ సినిమా చాలా అతిగా కనిపించింది. కేవలం మోడీని మెప్పించడానికే ఈ సినిమాతో వివేక్ భజన చేశాడన్న అభిప్రాయం అందరిలోనూ కలిగింది.

మోడీ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ వివేక్ ఏమీ తగ్గట్లేదు. మోడీ సర్కారును పైకి లేపే ఇంకో సినిమాకు అతను రెడీ అయ్యాడు. ఈసారి వివేక్ నటుడిగా కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. పాకిస్థాన్‌లోని బాలాకోట్ మీద భారత వాయుసేన దాడి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. పాకిస్థాన్‌‌ చేతికి చిక్కి.. ఆ తర్వాత స్వదేశానికి చేరుకుని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన అభినందన్ పాత్ర ఇందులో కీలకంగా ఉంటుందట.

బాలాకోట్ దాడి వెనుక కీలకంగా వ్యవహరించిన పింటీ అగర్వాల్ పాత్రను కూడా ఇందులో హైలైట్ చేయనున్నారట. ఐతే ‘యురి’ సినిమాలా విషయ ప్రధానంగా, వాస్తవికంగా తీస్తే ఏ ఇబ్బందీ లేదు. కానీ వివేక్‌కు మోడీ మీద ఉన్న విపరీత అభిమానం సినిమాను సజావుగా సాగనిస్తుందా అన్నది సందేహం. మోడీని ఎక్కువ చేసి చూపిించే క్రమంలో సినిమాను చెడగొడితే మాత్రం ఈ ప్రయత్నం వృథానే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English