చీర కొంగును నోట పట్టి ప్రభాస్ డ్యాన్స్ అదిరిపోయిందిగా..

 చీర కొంగును నోట పట్టి ప్రభాస్ డ్యాన్స్ అదిరిపోయిందిగా..

ఒక తెలుగు హీరో సినిమాకు రూ.300 కోట్లు ఖర్చు పెట్టటం అంటే.. అది కేవలం డార్లింగ్ ప్రభాస్ కు మాత్రమే సాధ్యమవుతుందేమో. అంత భారీగా బడ్జెట్ తో సినిమాను తీసిన తర్వాత.. దాన్ని ప్రచారం చేసుకోవటానికి ఎంతలా కష్టపడతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు.

ఈ నెలాఖరులో (ఆగస్టు 30న) విడుదల కానున్న సాహో మూవీ బజ్ ను మరింత పెంచేందుకు.. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్ని జోరుగా నిర్వహిస్తున్నారు.

సినిమా ప్రమోషన్ కు కలిసి వచ్చే అవకాశం ఉన్న ఈ వేదికను విడిచిపెట్టటం లేదు సాహో టీం. వరుస ప్రమోషన్ యాక్టివిటీలో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్.. తాజాగా ప్రముఖ హిందీ రియాల్టీ షో నచ్ బలియే సీజన్ 9లో పాల్గొని సందడి చేశారు.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న ప్రముఖ నటి రవీనాటాండన్ తో ప్రభాస్ చేసిన సందడి ఆసక్తికరంగానే కాదు.. అందరిని ఆకర్షించేలా ఉంది.

ఈ షోలో పాల్గొన్న ప్రభాస్.. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ చీర కొంగును నోటితో పట్టుకొని.. కిక్ చిత్రంలోని జుమ్మేకీ రాత్ హై పాటకు స్టెప్పులు వేసిన తీరు అందరిని ఆక్టుకుంది.

ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. రియాల్టీ షోలో డార్లింగ్ అల్లరి అందరినీ ఆకట్టుకునేలా చేయటమే కాదు.. సాహో యూనిట్ కు కావాల్సినంత ప్రచార మైలేజీని తెచ్చి పెట్టినట్లుగా చెబుతున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English