డేట్‌ కుదిరితే తేజ్‌కి బ్లాక్‌బస్టరే

డేట్‌ కుదిరితే తేజ్‌కి బ్లాక్‌బస్టరే

సాయి ధరమ్‌ తేజ్‌ ఫ్లాపులకి బ్రేక్‌ వేసి కాస్త ఊరటనిచ్చిన చిత్రలహరి తర్వాత అతను ఇంట్రెస్టింగ్‌ సినిమాలు టేకప్‌ చేస్తున్నాడు. ముందుగా మారుతి డైరెక్షన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని అందిస్తున్నాడు. 'ప్రతిరోజూ పండగే' టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం 'భలే భలే మగాడివోయ్‌' నిర్మాతలు, దర్శకుడు నుంచి వస్తోంది.

తాత-తండ్రి-మనవడు మధ్య అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో కుటుంబమంతా మెచ్చే వినోదం భారీ స్థాయిలో వుంటుందట. ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో మారుతి ఈ చిత్రాన్ని మలుస్తోన్న తీరుకి చిత్ర బృందం ముగ్ధులవుతున్నారు. ఈ చిత్రం ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ అవుతుందని ఇన్‌సైడర్స్‌ చెబుతున్నారు. అయితే ఇంతవరకు దీనికి సరయిన డేట్‌ కుదరలేదు.

సంక్రాంతికి విడుదల చేయాలని వున్నా కానీ అప్పుడు భారీ చిత్రాలుంటాయని వెనక్కి తగ్గుతున్నారు. డిసెంబర్‌లో కూడా చాలా చిత్రాలు విడుదలకి సిద్ధమవుతూ వుండడంతో దీనికి డేట్‌ దొరకడం లేదు. ఎంత మంచి సినిమాకి అయినా సక్సెస్‌ పరంగా మంచి రేంజ్‌ రావాలంటే డేట్‌ కుదరాలి. ప్రస్తుతానికి 'ప్రతి రోజూ పండగే'కి డేట్‌ అయితే దొరకలేదు. కాస్త ఆలస్యమయినా ఫర్వాలేదని వేసవి వరకు వేచి చూస్తారేమో తెలీదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English