సౌత్ సినిమా.. బాలీవుడ్ ఇజ్జత్‌‌ తీస్తోంది

సౌత్ సినిమా.. బాలీవుడ్ ఇజ్జత్‌‌ తీస్తోంది

ఓపక్క సౌత్ సినిమా ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోతోంది. హాలీవుడ్లో మాత్రమే సాధ్యం అని బాలీవుడ్ వాళ్లు ట్రై చేయని అద్భుతాల్ని సౌత్ ఫిలిం మేకర్లు సాధ్యం చేసి చూపిస్తున్నారు. దశాబ్దం కిందటే ‘మగధీర’ సినిమాతో రాజమౌళి తెలుగు తెరపై అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఆ తర్వాత శంకర్ ‘రోబో’తో మెస్మరైజ్ చేశాడు. ఆపై ‘ఈగ’, ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’, ‘2.0’ లాంటి సినిమాలు బాలీవుడ్ వాళ్లు నోరెళ్లబెట్టి చూసేలా చేశాయి.

ముఖ్యంగా ‘బాహుబలి’ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. బాలీవుడ్ వాళ్లు ఒక రకంగా ఈ సినిమా చూసి తల దించుకున్నారని చెప్పొచ్చు. శేఖర్ కపూర్ లాంటి లెజెండ్ రాజమౌళి బృందాన్ని పొగుడుతూ.. ఈ స్థాయి సినిమాలు తీయలేకపోతున్నందుకు, భారీ కలలు కనలేకపోతున్నందుకు బాలీవుడ్ ఫిలిం మేకర్లను ఏకేశాడు. ఇప్పటికైనా పాఠాలు నేర్వాలని అన్నాడు.

కట్ చేస్తే హిందీలోనూ కొన్ని భారీ ప్రయత్నాలు జరిగాయి. అందులో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ ఒకటి. కానీ ఆ సినిమాకు దారుణమైన ఫలితం వచ్చింది. మనకెందుకొచ్చిన భారీతనం, ప్రయోగాలు అంటూ బాలీవుడ్ వాళ్లు వెనుకంజ వేశారు. వాళ్ల స్టయిల్లో వాళ్లేదో సినిమాలు చేసుకుపోతున్నారు. ఏ పెద్ద దర్శకుడు, నిర్మాతల హీరో కూడా ‘బాహుబలి’ లాంటి ప్రయత్నాల గురించి ఆలోచించట్లేదు.

ఇంతలో బాలీవు్ వాళ్లను కవ్వించడానికి సౌత్‌లో భారీ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అందులో ముఖ్యమైంది ‘సాహో’. ఈ సినిమాను ముందు బాలీవుడ్ వాళ్లు లైట్ తీసుకున్నారు కానీ.. దీని ప్రోమోలు చూస్తే ఇది కూడా ‘బాహుబలి’కి దీటుగా వసూళ్ల మోత మోగించేలా కనిపించింది. ఉత్తరాదిన ఈ చిత్రానికి భారీ హైప్ వచ్చింది.
ఇంతలో ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ వచ్చి దాని స్థాయిని చాటి చెప్పింది. ఈ రెండు సినిమాలు అంచనాల్ని అందుకుని నార్త్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటితే మాత్రం బాలీవుడ్ ఫిలిం మేకర్లకది చాలా ఇబ్బందికరంగా మారడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English