ప్రభాస్ చెప్పాడు.. పెళ్లి చేసుక్కోమ్మా అనుష్కా

ప్రభాస్ చెప్పాడు.. పెళ్లి చేసుక్కోమ్మా అనుష్కా

ప్రభాస్ పెళ్లి గురించి.. అనుష్కతో అతడి బంధం గురించి చాలా ఏళ్లుగా చాలా ఊహాగానాలు విన్నాం. స్క్రీన్ మీద, స్క్రీన్ అవతల కెమిస్ట్రీ చూస్తే వీళ్లిద్దరి మధ్య ప్రత్యేకమైన బంధం ఉన్నట్లే కనిపిస్తుంది. కానీ వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటామంటే అందరికీ సంతోషమే కానీ.. ఇప్పటిదాకా ఆ ఇద్దరూ ఆ దిశగా ఎప్పుడూ మాట్లాడలేదు. తమ మధ్య ఏదో ఉందనే విషయాన్ని ఖండిస్తూనే ఉన్నారు.

ఈ మధ్య ఊహాగానాలు మరీ ఎక్కువైపోవడం, ఇంటర్వ్యూల్లో కూడా తరచుగా అనుష్క గురించి ప్రశ్నలు తలెత్తుతుండటంతో ప్రభాస్ కూడా విసిగిపోయినట్లున్నాడు. మామూలుగా చాలా సున్నితంగా మాట్లాడే ప్రభాస్.. అనుష్క విషయంలో మాత్రం కొంచెం రఫ్‌గానే జవాబులిస్తున్నాడు. గత రెండేళ్లలో తామిద్దరం ఎప్పుడైనా కలిసి కనిపించామా అంటూ సూటిగా ప్రశ్నించి తమ ఎఫైర్ రూమర్లకు చెక్ పెట్టాలని చూశాడు ప్రభాస్.

అంతటితో ఆగకుండా తాజాగా మరో ఇంటర్వ్యూలో ఇంకో అడుగు ముందుకేశాడు. తమ ఇద్దరిలో ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటే తప్ప ఈ ఊహాగానాలకు తెరపడదని అన్నాడు. ‘‘ముందు నేనైనా లేదా అనుష్క అయినా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. అప్పటి వరకు ఈ రూమర్స్ ఆగేలా లేవు. ‘నువ్వైనా పెళ్లి చేస్కో’ అని అనుష్కను కలిసినపుడు చెబుతా’’ అని ప్రభాస్ పేర్కొనడం విశేషం.

ఒకవేళ తామిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉంటే దాన్ని దాచాల్సిన అవసరం లేదన్న ప్రభాస్... ఇలాంటి నెగెటివ్ వార్తల్ని ప్రచారం చేయడం తప్పని మీడియాకు హితవు పలికాడు. మరి ప్రభాస్ ఇంత ఓపెన్‌గా ఈ స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఇకనైనా ఈ ప్రచారం ఆగుతుందేమో చూడాలి. మరోవైపు ప్రభాస్ అయితే ఇప్పటికీ పెళ్లి విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు లేడు కాబట్టి అతను కోరుకున్నట్లు అనుష్కే ముందుగా వేరే వ్యక్తితో మూడుముళ్లు వేయించేసుకుంటుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English