ప్రభాస్ దంచాల.. చిరు గంతెయ్యాల

ప్రభాస్ దంచాల.. చిరు గంతెయ్యాల

ఓవైపు సాహో.. ఇంకోవైపు సైరా.. మన తెలుగు సినీ పరిశ్రమ నుంచి నెల వ్యవధిలో రాబోయే ప్రతిష్టాత్మక చిత్రాలివి. వీటిలో ఎక్కువ అంచనాలున్నది ‘సాహో’ మీదే. దాని రేంజ్ వేరనే చెప్పాలి. అదే ముందుగా బాక్సాఫీస్ బరిలో నిలవబోతోంది కూడా. మామూలుగా చూస్తే రెండు భారీ చిత్రాలు నెల వ్యవధిలో రిలీజవుతున్నపుడు.. ముందు వచ్చే సినిమా బాగా ఆడేస్తే రెండో సినిమాకు కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ప్రేక్షకులు ఆల్రెడీ పతాక స్థాయి వినోదంలో మునిగి తేలినపుడు.. తర్వాత వచ్చే భారీ సినిమా విషయంలో ఆసక్తి కొంత తగ్గుతుంది.

పోయినేడాది ‘భరత్ అనే నేను’కు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా.. అప్పటికే ‘రంగస్థలం’తో ప్రేక్షకులు బాగా ఎంటర్టైన్ అయి ఉండటంతో దీనిపై ఆసక్తి కొంచెం తగ్గింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఆపై వచ్చిన ‘నా పేరు సూర్య’ యావరేజ్ మూవీనే అయినా డిజాస్టర్ కావడానికి కారణం ముందు వచ్చిన సినిమాలు చాలా బాగుండటమే.

ఈ రకంగా చూస్తే ‘సాహో’ మరీ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేయకూడదని.. ‘సైరా’ టీం కోరుకోవాలి. కానీ ఈ కోణం నిజమే అయినప్పటికీ ‘సాహో’ బాగా ఆడటం మరో రకంగా ‘సైరా’ టీంకు అవసరం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా దేశమంతటా చొచ్చుకెళ్లేలా చేయాలని ఆశిస్తున్నారు దర్శక నిర్మాతలు. అందుకోసం భారీ ప్లానింగే నడుస్తోంది. ఐతే ‘బాహుబలి’, ‘సాహో’ల్లా దీనికి ఇతర భాషల్లో హైప్ వస్తుందా అన్నది సందేహంగానే ఉంది.

ఈ నేపథ్యంలో ‘సాహో’ బాగా ఆడి తెలుగు సినిమా సత్తాను మరోసారి రుజువు చేస్తే.. ‘సైరా’ మీద కూడా తెలుగు రాష్ట్రాల అవతల ప్రేక్షకుల్లో భరోసా ఏర్పడుతుంది. ఈ టాలీవుడ్ వాళ్లు మామూలోళ్లు కాదనే ఫీలింగ్ కలుగుతుంది. అది ‘సైరా’ మీద కూడా అంచనాలు పెరగడానికి కారణం అవుతుంది. ‘సాహో’ ఆడకపోతే.. ‘సైరా’ మీద కచ్చితంగా నెగెటివ్ ఎఫెక్ట్ ఉంటుందనడంలో సందేహం లేదు.  అందుకే ‘సాహో’ బాగా ఆడాలని ‘సైరా’ టీం గట్టిగా కోరుకుంటుందనడంలో మరో మాట లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English