ఉన్న సందేహాలు చాలవా బన్నీ?

ఉన్న సందేహాలు చాలవా బన్నీ?

మెగా ఫ్యామిలీలో అంతర్గత సంబంధాల గురించి గత కొన్ని నెలల్లో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అల్లు అర్జున్ మెగా గొడుగు నుంచి బయటికొచ్చి సొంతంగా ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నించిన వైనాన్ని అందరూ గమనిస్తూనే ఉన్నారు. వివిధ సందర్భాల్లో అతను సందేహాస్పదంగానే వ్యవహరిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అభిమానులకు అతడికి మధ్య ఎంత పెద్ద అగాథం నెలకొందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

మెగాస్టార్ ప్రస్తావన వచ్చినపుడల్లా బన్నీ ఆకాశానికెత్తేస్తుంటాడు కానీ.. అందులో ఏదో ఒక కృత్రిమత్వం కనిపిస్తూ ఉంటుంది. ఆ సంగతలా ఉంచితే.. తాజాగా ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ రిలీజైతే బన్నీ దాని గురించి సోషల్ మీడియాలో ఎక్కడా ఒక్క కామెంట్ కూడా పెట్టలేదు. దీని గురించి కామెంట్ చేయలేనంత బిజీగా ఉన్నాడా అన్న ప్రశ్న మెగా అభిమానుల్లోనే తలెత్తింది.

బన్నీ మాత్రమే కాదు.. అతడి తమ్ముడు శిరీష్ సైతం ‘సైరా’ టీజర్ విషయంలో సైలెంటుగానే ఉన్నాడు. బన్నీ ఓవైపు కూతురితో ఆడుకుంటున్న వీడియో షేర్ చేసుకోగలిగాడు కానీ.. సైరా గురించి మాత్రం మాట్లాడలేదు. ఒక్క నిమిషం దీని కోసం సమయం కేటాయించలేకపోవడం ఏమిటా అన్న సందేహాలు తలెత్తాయి.

ఇది చాలదన్నట్లు ఈసారి మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలకు కూడా బన్నీ దూరంగా ఉన్నాడు. కొన్నేళ్లుగా అతను ఈ కార్యక్రమంలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నాడు. ఈసారి అతడి తీరు అసలే సందేహాస్పదంగా ఉండగా.. ఈ ఈవెంట్‌కు రాకపోవడంతో డౌట్లు మరింతగా పెరిగాయి. బన్నీ తండ్రి అల్లు అరవింద్ వచ్చారు కానీ.. అది డిఫాల్ట్ వ్యవహారంగా భావించాలి. బన్నీ రావడం, రాకపోవడం మీదే జనాల దృష్టి నిలిచి ఉంటుంది.

ఎన్నడూ లేని విధంగా ఈసారి పవన్ రావడంతో బన్నీ ఆగాడేమో అనిపిస్తోంది. తాను పవన్‌తో కలిసి ఈ ఈవెంట్లో పాల్గొంటే, స్టేజ్ మీదికి వెళ్తే పవన్ అభిమానుల స్పందన ఎలా ఉంటుందోనన్న సందేహలే బన్నీని ఇక్కడికి రాకుండా ఆపాయా? లేక షూటింగ్ బిజీ వల్లే అతను రాలేకపోయాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English