నాగ్‌కు ఇక గత్యంతరం లేదు

నాగ్‌కు ఇక గత్యంతరం లేదు

అక్కినేని నాగార్జునకు ఒక చెడ్డ అలవాటుంది. ఓపెన్‌గా మాట్లాడే క్రమంలో కొన్నిసార్లు దర్శకుల గాలి తీసేస్తుంటాడు. ఇలా ఆయన మాట్లాడిన మాటలు కొందరు దర్శకుల కెరీర్లనే ప్రమాదంలో పడేశాయి. అందుకు వీరభద్రం చౌదరి సరైన ఉదాహరణ. అతడిని నమ్మి సొంత బేనర్లో ‘భాయ్’ సినిమా చేశాడు నాగ్. స్క్రిప్టు విన్నపుడు, సినిమా చేస్తున్నపుడే ఫలితం అర్థమై ఉండాలి. కానీ నమ్మకంగా సినిమా చేసి.. రిలీజ్ అయ్యాక నాగ్ స్వరం మార్చేశాడు. ఈ సినిమా గురించి, దర్శకుడి గురించి చాలా బ్యాడ్‌గా మాట్లాడాడు. దెబ్బకు వీరభద్రం కెరీరే క్లోజ్ అయిపోయింది.

ఇదే తరహాలో యువ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల గురించి కూడా కొంచెం తేలిగ్గా మాట్లాడాడు నాగ్. అక్కినేని తండ్రీ కొడుకులకు ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ లాంటి సూపర్ హిట్లు అందించిన ఘనత కళ్యాణ్‌కు దక్కతుంది.

కానీ అతను వీళ్లిద్దరితో కలిసి ‘బంగార్రాజు’ చేయాలని అనుకుంటే.. ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు నాగ్. స్క్రిప్టును ఒక పట్టాన ఓకే చేయలేదు. నరేషన్ వినడానికి కూడా చాలా వెయిట్ చేయించాడు. స్క్రిప్టు బాలేదంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సినిమా చేస్తానో చేయనో అన్నాడు.

‘బంగార్రాజు’ విషయంలో ఇంత కఠినంగా ఉన్న నాగ్.. మధ్యలో ‘ఆఫీసర్’ లాంటి ఆల్ టైం డిజాస్టర్లో నటించి తన జడ్జిమెంట్ మీద జనాలకు సవాలక్ష ప్రశ్నలు రేకెత్తించాడు. తాజాగా ఆయన్నుంచి ‘మన్మథుడు-2’ అనే కళాఖండం వచ్చింది. ఓ ఫ్రెంచ్ సినిమా రీమేక్ హక్కులు కొని ఈ చిత్రం చేసిన ఘనత నాగార్జునదే. ఈ సినిమా దెబ్బకు నాగ్ మార్కెట్ మరింతగా దెబ్బ తింది. కెరీరే ప్రమాదంలో పడింది.

ఇప్పుడు నాగార్జునతో సినిమా చేయడానికి పేరున్న దర్శకులెవరూ ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మరో ఛాయిస్ లేక ‘బంగార్రాజు’నే పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యాడు నాగ్. ఆయన వేరే గత్యంతరమే లేదని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కళ్యాణే డిమాండింగ్ పొజిషన్లో ఉన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English