ప్రభాస్ అతి పెద్ద బలహీనత.. ఒప్పేసుకున్నాడు

ప్రభాస్ అతి పెద్ద బలహీనత.. ఒప్పేసుకున్నాడు

‘మిర్చి’ సినిమాలో ‘కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్’ అనే డైలాగ్ ప్రభాస్‌కు భలేగా సూటైంది. టాలీవుడ్లో ఇలాంటి కటౌట్.. మ్యాన్లీనెస్ ప్రభాస్‌కు తప్ప ఇంకెవరికీ లేదని ఒప్పుకోవాల్సిందే. ఫిజిక్, లుక్ పరంగా ప్రభాస్ రేంజే వేరుగా ఉంటుంది. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుంటుంది. ‘బాహుబలి’ సినిమాలో ఎలా రాజసాన్ని చూపించాడో తెలిసిందే.

ఇక నటన విషయానికి వస్తే ప్రభాస్ సూపర్ అనలేం కానీ.. నాట్ బ్యాడ్ అనిపిస్తాడు. ఇలా ప్రభాస్‌లో మంచి క్వాలిటీస్ చాలానే ఉన్నా.. ఒక విషయంలో మాత్రం అతను వీక్ అని ఒప్పుకోవాల్సిందే. అదే.. డైలాగ్ డెలివరీ. ప్రభాస్‌కు మొదట్నుంచి వాయిస్ అనేది పెద్ద మైనస్‌గా ఉంటోంది. డైలాగుల్ని ఫ్రీ ఫ్లోతో చెప్పలేడు. పట్టి పట్టి మాట్లాడతాడు. ఇది చాలా సినిమాల్లో ఎబ్బెట్టుగా తయారైంది.

కెరీర్ ఆరంభంలో అయితే ప్రభాస్ డైలాగులు చెప్పడంలో మరీ ఇబ్బంది పడేవాడు. ‘బుజ్జిగాడు’ సినిమాతో ప్రభాస్ స్టైల్ కొంచెం మార్చి డైలాగ్ డెలివరీలో ఈజ్ వచ్చేలా చేశాడు పూరి జగన్నాథ్. అయినప్పటికీ ఇంకా ప్రభాస్ డైలాగ్ పలకడంలో కొంత ఇబ్బంది పడుతూనే ఉంటాడు. ఐతే ఈ బలహీనత గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ స్వయంగా ఒప్పుకోవడం విశేషం.

తన బలాబలాల గురించి మాట్లాడుతూ.. తాను నటన విషయంలో ఎప్పుడూ ఇబ్బంది పడలేదన్నాడు యంగ్ రెబల్ స్టార్. కళ్లతో భావాలు పలికించగలనని, క్లోజప్ షాట్లకు కూడా ఇబ్బంది పడనని చెప్పాడు. కానీ డైలాగ్ డెలివరీ అనేది మాత్రం తన బలహీనత అని.. ఈ విషయంలో మెరుగు పడటానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నానని ప్రభాస్ వినమ్రంగా చెప్పాడు. బాలీవుడ్ సూపర్ స్టార్లకు దీటుగా తిరుగులేని ఇమేజ్ సంపాదించాక కూడా ఇలా తన మైనస్ గురించి ఓపెన్‌గా అంగీకరించడం ప్రభాస్‌కే చెల్లింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English