సైరాకి ప్రభాస్‌ సాయం

సైరాకి ప్రభాస్‌ సాయం

'సైరా' చిత్రానికి దేశ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందా లేక దీనిని ఒక సగటు ప్రాంతీయ చిత్రంగానే చూస్తారా అనే అనుమానాలు వుండేవి. మొదటి టీజర్‌ వచ్చినపుడు బాలీవుడ్‌ ఈ చిత్రాన్ని అస్సలు లెక్క చేయలేదు. కానీ రెండవ టీజర్‌కి తెలుగుతో సమానమయిన స్పందన హిందీ నుంచి కూడా వచ్చింది. ఇందుకోసం నిర్మాత రామ్‌ చరణ్‌ మంచి స్ట్రాటజీ ఫాలో అయ్యాడు.

తెలుగు సినిమాలా కాకుండా హిందీకి వెళ్లి ప్రోపర్‌గా ప్రమోషన్స్‌ చేసాడు. ఈ విషయంలో ప్రభాస్‌ అతనికి బాగా హెల్ప్‌ అయ్యాడట. బాహుబలి, సాహో వల్ల ప్రభాస్‌కి అక్కడి మీడియాతో లింక్స్‌ బాగున్నాయి. ప్రభాస్‌ 'సైరా' గురించి బాగా చెబుతూ వుండడంతో అక్కడి మీడియా దృష్టి దీనిపై పడింది. అలాగే సైరాని హిందీలో ఫర్హాన్‌ అక్తర్‌ రిలీజ్‌ చేస్తూ వుండడంతో సహజంగానే ఆసక్తి పెరిగింది.

కేవలం టీజర్‌ రిలీజ్‌ చేసి వచ్చేయడం అని కాకుండా అక్కడి మీడియాతో ఇంటరాక్ట్‌ అవడానికి, ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా ప్రభాస్‌ సలహాలు, సూచనలు దోహదపడ్డాయట. సాహో కోసం మీడియాతో టచ్‌లోనే వున్న ప్రభాస్‌ పనిలో పనిగా సైరా పని సులువు చేసేసాడు.

ఇదిలావుంటే సాహో హిందీలో భారీ విజయం సాధించాలని సైరా బృందం బాగా కోరుకుంటోంది. బాహుబలి తర్వాత ఈ చిత్రం కూడా హిందీలో బాగా ఆడినట్టయితే అది ఆటోమేటిగ్గా సైరాకి ఇంపార్టెన్స్‌ పెంచుతుంది. మరోవైపు సాహో చిత్ర నిర్మాణంలో చరణ్‌ కూడా ఓ చెయ్యి వేసాడనే టాక్‌ ఎలాగో వుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English