విజయ్‌ దేవరకొండ ఆటలు సాగలేదు!

విజయ్‌ దేవరకొండ ఆటలు సాగలేదు!

డియర్‌ కామ్రేడ్‌ పరాజయం తర్వాత విజయ్‌ దేవరకొండ బాగా డల్‌ అయ్యాడు. ఈ టైమ్‌లో మరో పరాజయం అఫార్డ్‌ చేయలేడు కనుక ప్రస్తుతం చేస్తోన్న చిత్రాలపై కూడా రీఎనాలిసిస్‌ చేసుకున్నాడు. హీరో చిత్రాన్ని ఆపేసినా కానీ క్రాంతిమాధవ్‌తో చేస్తోన్న చిత్రాన్ని మాత్రం వాయిదా వేయడం కుదర్లేదు. పెళ్లి చూపులు తర్వాత విజయ్‌ విని ఓకే చేసిన కథ ఇది. కానీ ఆ తర్వాత హీరోగా అతను చాలా ఎదిగాడు.

మరి ఇప్పటి ఇమేజ్‌కి తగ్గట్టుగా ఈ సినిమా వుంటుందా లేదా అనేది అతనికీ ఐడియా లేదు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాధ్‌తో వెంటనే ఒక సినిమా చేసేసి తర్వాత క్రాంతిమాధవ్‌ చిత్రాన్ని పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ అందుకు ఆ చిత్ర నిర్మాత కె.ఎస్‌. రామారావు అంగీకరించలేదు.

ఇప్పుడు కనుక ఈ చిత్రం ఆపేస్తే విజయ్‌కే నమ్మకం లేదని సినిమా కిల్‌ అయిపోతుందని, అంచేత ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాతే ఏ సినిమా అయినా చేయాలని ఆయన గట్టిగా చెప్పాడు. దీంతో విజయ్‌ ఈ చిత్రం పూర్తి చేసే వరకు ఆగాలని పూరికి కూడా చెప్పేసాడు. సాధారణంగా ఒక సినిమా తర్వాత మరో చిత్రం మొదలు పెట్టేసే పూరి ఈ చిత్రం కోసం జనవరి వరకు ఖాళీగా వుండనున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English