పవన్‌ కళ్యాణ్‌ వద్దు బాబోయ్‌!

పవన్‌ కళ్యాణ్‌ వద్దు బాబోయ్‌!

'సైరా' టీజర్‌తో సురేందర్‌ రెడ్డి తన సత్తా చాటుకున్నాడు. ఈ చిత్రాన్ని ఎలా మలుస్తాడో అనే అనుమానాలని పటాపంచలు చేసాడు. అలాగే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'గా చిరంజీవి ఈ వయసులో ఎలా వుంటారో అనేదానిపై కూడా సందేహాలు వదిలిపోయాయి. ఆ పాత్రలో చిరంజీవి బాగున్నారనే ఫీడ్‌బ్యాక్‌ వస్తోంది.

అయితే తెలుగు టీజర్‌కి పవన్‌కళ్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌ వాడడం, పవన్‌ ఆ డైలాగులు 'నీరసరగా' చెప్పడం చాలా మంది మెగా అభిమానులకే నచ్చలేదు. ఎంతో డెప్త్‌తో, ఎమోషన్‌తో పలకాల్సిన సంభాషణలు పవన్‌ చాలా ఫ్లాట్‌గా చెప్పాడని, అలాంటి డైలాగులని జూనియర్‌ ఎన్టీఆర్‌ లాంటి హీరో చెబితే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో తారక్‌తో కలిసి నటిస్తోన్న చరణ్‌ కావాలనుకుంటే వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడానికి అతను కాదనేవాడు కాదు.

కాకపోతే మెగా అభిమానులని ఒక్క తాటిపైకి తేవాలనే ప్రయత్నం ఎప్పట్నుంచో చేస్తోన్న చరణ్‌ ఈసారికి పవన్‌కళ్యాణ్‌ని వాడుకున్నాడు. ఈ టీజర్‌లో వినిపించిన మాటలే కాకుండా సినిమాలో వాయిస్‌ ఓవర్‌ పార్ట్‌ చాలా వుందని, అదంతా పవన్‌ కళ్యాణే చెబుతున్నాడని చెప్పుకుంటున్నారు. దీనికి మెగా అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

కొందరు పవన్‌ వాయిస్‌ ఓవర్‌ ప్లస్‌ అవుతుందని అంటూ వుంటే, కావాలంటే పవన్‌తో ఒక గెస్ట్‌ అప్పీయరెన్స్‌ ఇప్పించాలే తప్ప తన జోన్‌ కాని వాయిస్‌ ఓవర్‌లాంటివి చేయించి సినిమా మూడ్‌ స్పాయిల్‌ చేయరాదని మరికొందరు చెబుతున్నారు. మరి అక్టోబర్‌ 2న విడుదలయ్యే సైరా వచ్చేలోగా చరణ్‌ ఎవరివైపు మొగ్గుతాడు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English