విజయ్ దేవరకొండ మారిపోయాడబ్బా..

విజయ్ దేవరకొండ మారిపోయాడబ్బా..

విజయ్ దేవరకొండ అంటే ఒక ఎనర్జీ.. ఒక ఉత్సాహం. అతను వేదిక ఎక్కాడంటే ఎంత సందడి చేస్తాడో తెలిసిందే. తన అభిమానుల్ని ‘వాట్సాప్ వాట్సాప్ మై రౌడీ బాయ్స్’ అంటూ అతను సంబోధించే తీరే చాలా భిన్నంగా ఉంటుంది. అభిమానుల్ని మించి అరుపులతో అతను స్టేజ్‌ను వేడెక్కించేస్తాడు. ఐతే ‘డియర్ కామ్రేడ్’ పరాజయం అతడిలో ఉత్సాహాన్ని తగ్గించేసినట్లుంది.

ఆ సినిమా రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో ఇనాక్టివ్ అయిపోయిన విజయ్.. ఈ మధ్య సైమా వేడుకతో మళ్లీ మీడియాలో కనిపించాడు. తాజాగా అతను ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ చిత్ర కథానాయిక ఐశ్వర్యా రాజేష్, నిర్మాత కె.ఎస్.రామారావులతో కలిసి విజయ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కర్టసీ కోసం ఈ ఆడియో వేడుకకు వచ్చాడు విజయ్.

ఈ సందర్భంగా విజయ్ ఉత్సాహం పూర్తిగా తగ్గిపోయింది అనలేం కానీ.. అతను మాత్రం మునుపటిలా సందడి చేయలేదు. తన రౌడీ అభిమానుల్ని అతను తన ట్రేడ్ మార్క్ పలకరింపుతో అలరించలేదు. ఎక్కడా కూడా హై పిచ్‌లో మాట్లాడలేదు. ఇది తన సినిమా ఈవెంట్ కాదు కాబట్టి ఇలా ఉన్నాడనుకోవడానికేమీ లేదు.

తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమా ‘దొరసాని’ ప్రి రిలీజ్ ఈవెంట్లో అతను అభిమానుల్ని తనదైన శైలిలోనే పలకరించాడు. ఇక ప్రసంగంలో కూడా విజయ్ మార్కు మెరుపులు కనిపించలేదు. ఎక్కడా యాటిట్యూడ్ కనిపించలేదు. బోల్డ్ కామెంట్లు లేవు.

మిగతా హీరోల్లాగే చిత్ర బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తాడు. రొటీన్ కామెంట్లే చేశాడు. ఐశ్వర్య నటనను మెచ్చుకున్నాడు. కె.ఎస్.రామారావు మంచితనం గురించి మాట్లాడాడు. అంతకుమించి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యే కామెంట్ అయితే ఒక్కటీ చేయలేదు. ఐశ్వర్యతో కలిసి స్టేజ్ మీద క్రికెట్ ఆడటం మాత్రం అభిమానుల్ని అలరించింది. మిగతా వ్యవహారమంతా రొటీనే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English