అల్లు అర్జున్‌ ఎట్టకేలకు కరుణించాడు

అల్లు అర్జున్‌ ఎట్టకేలకు కరుణించాడు

త్రివిక్రమ్‌తో సినిమా అయితే మొదలు పెట్టాడు కానీ అప్పట్నుంచీ ప్రెజర్‌ టాక్టిక్స్‌ అయితే మానలేదు అల్లు అర్జున్‌. ఒకవైపు షూటింగ్‌ జరుగుతూ వుండగానే వేరే దర్శకులతో మంతనాలు జరుపుతూ వుండడం, ఇంకా ఈ షూటింగ్‌ పూర్తి కాకుండానే మరొకటి మొదలు పెడతానంటూ మీడియాకి ఫీలర్లు ఇవ్వడం లాంటి ఎత్తులతో త్రివిక్రమ్‌ని అనుక్షణం 'ఆన్‌ ది టోస్‌' వుంచారు.

అయితే ఇటీవల విడుదల చేసిన టైటిల్‌ టీజర్‌లో త్రివిక్రమ్‌ తన చమత్కారం చూపించడంతో అల్లు అర్జునుడు ఫిదా అయ్యాడు. 'గురూజీ'లో ఇంకా పస తగ్గలేదని గ్రహించాడు. అందుకని ప్రస్తుతానికి వేరే సినిమాల మాట పక్కన పెట్టి ఇది పూర్తి చేసే వరకు త్రివిక్రమ్‌కి పూర్తి స్వేఛ్ఛని ఇచ్చాడు. అసలే 'అల వైకుంఠపురములో' సంక్రాంతికి మహేష్‌ 'సరిలేరు నీకెవ్వరు'తో పోటీ పడుతోంది కనుక అల్లాటప్పా సినిమా ఇస్తే సరిపోదు.

అందుకే దర్శకుడిపై ఒత్తిడి తగ్గించి అతనికి వీలయినంత సమయాన్ని ఇచ్చి మంచి అవుట్‌పుట్‌ తెచ్చుకోవాలని డిసైడ్‌ అయ్యాడు. ఒకవేళ ఈలోగా సుకుమార్‌ చిత్రానికి ముహూర్తం చేసినా కానీ 'అల వైకుంఠపురములో' విడుదలైన పిమ్మట అంటే జనవరి తర్వాతే షూటింగ్‌ మొదలు పెడతాడు. అసలే ఆ చిత్రం కోసం అల్లు అర్జున్‌ ఒక కొత్త గెటప్‌ కూడా వేయనున్నాడు కనుక అది వెంటనే మొదలయ్యే ఆస్కారమే లేదు.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English