అభిమానుల డిమాడ్ మేరకు రానా..

అభిమానుల డిమాడ్ మేరకు రానా..

దగ్గుబాటి రానా గురించి అంటే ఇంతకుముందు పాత్రలు, సినిమాల చర్చే ఉండేది. కానీ కొంత కాలంగా అతడి అనారోగ్యం గురించే విపరీతమైన చర్చ జరుగుతోంది. రానా కిడ్నీ దెబ్బ తిందని.. దాన్ని రీప్లేస్ చేస్తున్నారని.. కుటుంబ సభ్యుల్లో ఒకరు కిడ్నీ ఇస్తున్నారని.. ఈ ట్రీట్మెంట్లో భాగంగా రానా వీక్ అయ్యాడని.. ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. దీన్ని ఖండించి ఖండించి అలసిపోయింది దగ్గుబాటి ఫ్యామిలీ.

మధ్యలో ఈ ప్రచారం కొంత తగ్గుముఖం పట్టినా.. ఈ మధ్య రానా మళ్లీ అమెరికా పర్యటనకు వెళ్లడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. అభిమానుల్లో రానా ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలోనే రానా లేటెస్ట్ పిక్ చూపించాలంటూ సోషల్ మీడియాలో అతడిని ట్యాగ్ చేస్తూ అభిమానులు డిమాండ్లు చేయడం మొదలుపెట్టారు.

దీంతో రానా స్పందించక తప్పలేదు. కాసేపాగడండి.. షేర్ చేస్తా అంటూ.. కార్లో కూర్చుని ఉన్న ఒక ఫొటోను రానా ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. అందులో రానా కొన్ని నెలలుగా కనిపిస్తున్న తీరులోనే కనిపించాడు. హాథీ మేరీ సాథీ సినిమా కోసం అతను సన్నబడి, గడ్డం పెంచి డిఫరెంట్‌ లుక్‌లోకి మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అనారోగ్యం అని.. బలహీన పడ్డాడని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఈ పిక్ చూస్తే అర్థమవుతోంది.

రానా లాస్ ఏంజెల్స్ నుంచి ఈ ఫొటో దిగి పంపుతున్నట్లు వెల్లడించాడు. కానీ కారు లోపల ఉండటం వల్ల అతనెక్కడున్నది చెప్పలేని పరిస్థితి. పైగా ఆ ఫొటో లేటెస్ట్‌దే అనడానికి కూడా ఆధారాలు లేవు. ఈ రకమైన సందేహాలేమీ రాకుండా ఎప్పుడు, ఎక్కడ ఫొటో దిగిందనే విషయంలో క్లారిటీ వచ్చేలా రానా ప్లాన్ చేసి ఉంటే బాగుండేదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English