సాహో ఫలితం పై భయం వుంది - ప్ర‌భాస్

సాహో ఫలితం పై భయం వుంది - ప్ర‌భాస్

విక్ర‌మార్కుడు సినిమాలో పోలీస్ అయిన‌ ముందు వెనుక చూడ‌కుండా విల‌న్ మీదికి వెళ్లిపోతుంటాడు. అది చూసి ఉన్న‌తాధికారి నీకు భ‌యం లేదా అని అడుగుతాడు. భ‌యం అంటే నాకెందుకు తెలియ‌దు సార్.. అంటూ అదిరిపోయే డైలాగ్ చెబుతాడు రవితేజ‌. ఇప్పుడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సైతం ఇలాంటి డైలాగే చెబుతున్నాడు.

బాహుబ‌లితో శిఖ‌ర స్థాయి ఇమేజ్ సంపాదించాడు ప్ర‌భాస్. దేశ‌వ్యాప్తంగా అత‌డికి పాపులారిటీ వ‌చ్చింది. బాహుబ‌లి రెండు భాగాలు ఏ స్థాయి విజ‌యాలు సాధించాయో తెలిసిందే. ఆ సినిమా ఊపు త‌గ్గ‌కుండా దాని త‌ర్వాత సాహో లాంటి మ‌రో మెగా ప్రాజెక్టు చేశాడు. ఇది కూడా పెద్ద హిట్టే అయ్యేలా క‌నిపిస్తోంది. ప్రి రిలీజ్ బ‌జ్ అయితే మామూలుగా లేదు. మ‌రి ఈ సినిమా ఏమైనా తేడా కొడితే.. ఆ భ‌యం ఏమీ లేదా? ఈ సినిమానో మ‌రొక‌టో ఫ్లాప్ అవుతుందేమో అన్న భ‌యం లేదా అని అడిగితే.. ప్ర‌భాస్ త‌న‌దైన శైలిలో బ‌దులిచ్చాడు.

ఏదో ఒక ద‌శ‌లో ఫెయిల్యూర్ మ‌నకోసం ఎదురు చూస్తుంటుంది. అందులోనూ ఇంతేసి పెద్ద సినిమాలు చేశాక భ‌యం క‌చ్చితంగా ఉంటుంది. సాహో కోసం రెండేళ్లు వెచ్చించాను. ఈ స‌మ‌యంలో నాలుగు సినిమాలు చేసి ఇంకా ఎక్కువ ఆదాయం పొంది ఉండొచ్చు. అయినా సాహోను పెద్ద స్థాయిలో చేయాల‌ని చేశాం. ఈ సినిమా ఫ‌లితం విష‌యంలో భ‌యం లేకుండా లేదు. నిర్మాత‌ల గురించి భ‌యం ఉంటుంది.

ఇంత‌మంది న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు ప‌డ్డ క‌ష్టం ఏమ‌వుతుందో అన్న భ‌యం ఉంటుంది. కాబ‌ట్టి ఫెయిల్యూర్ తాలూకు భ‌యం ప్ర‌తి రోజూ వెంటాడుతుంది అని ప్ర‌భాస్ చెప్పాడు. బాహుబ‌లి త‌ర్వాత సాహో లాంటి మ‌రో భారీ చిత్రం కోసం చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింద‌ని.. కొన్నేళ్ల పాటు మ‌ళ్లీ ఇలాంటి భారీ చిత్రాలు చేయొద్ద‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నాన‌ని ప్ర‌భాస్ చెప్ప‌డం విశేషం. దీన్ని బ‌ట్టి ప్ర‌భాస్ ఎంత ఒత్త‌డికి గుర‌వుతున్నాడో అర్థం చేసుకోవ‌చ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English