చిరు భ‌యం.. చ‌ర‌ణ్‌, సూరి ధైర్యం

చిరు భ‌యం.. చ‌ర‌ణ్‌, సూరి ధైర్యం

దాదాపు మూడు ద‌శాబ్దాలు తెలుగు తెర‌ను ఏలాడు మెగాస్టార్ చిరంజీవి. అప్ప‌ట్లో చిరు మీద ఎంత ఖ‌ర్చు చేసినా భ‌యం లేద‌నే ధీమా ఉండేది నిర్మాత‌ల్లో. శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి అప్ప‌ట్లోనే అంజి సినిమా మీద 30 కోట్ల దాకా ఖ‌ర్చు పెట్టాడంటే అది చిరు మీద ఉన్న న‌మ్మ‌కంతోనే. ఇంకా మ‌రెన్నో భారీ బ‌డ్జెట్ సినిమాలు తెర‌కెక్కాయి చిరు హీరోగా.

కానీ తిరుగులేని మార్కెట్, బాక్సాఫీస్ స్టామినా ఉన్న చిరు కూడా ఒక సినిమా విషయంలో మాత్రం బ‌డ్జెట్ గురించి భ‌య‌ప‌డ్డాడ‌ట‌. ఖ‌ర్చు భ‌రించ‌లేమ‌న్న కార‌ణంతోనే ఆ సినిమాను ఆపేశార‌ట‌. ఆ చిత్రం మ‌రేదో కాదు.. సైరా న‌ర‌సింహారెడ్డి.

ఉయ్యాల‌వాడ క‌థ‌తో చిరు హీరోగా సినిమా తీయ‌డానికి ద‌శాబ్దం కింద‌టే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. కానీ అప్ప‌టికి తెలుగు సినిమా మార్కెట్ స్థాయికి రెట్టింపు ఖ‌ర్చు ఈ చిత్రం మీద పెట్టాల్సి రావ‌డంతో ఇది వ‌ర్క‌వుట్ కాద‌ని చిరు భ‌య‌ప‌డ్డాడ‌ట‌. అందుకే ఈ సినిమా చేయ‌లేద‌ట‌. ఐతే గ‌త ద‌శాబ్ద కాలంలో మ‌న సినిమా స్థాయి పెరిగింద‌ని.. తన భ‌యాల‌న్నింటినీ పోగొట్టి త‌న కొడుకు రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి సైరా న‌ర‌సింహారెడ్డి క‌ల‌ను నిజం చేశార‌ని అన్నాడు చిరు.

"మన దేశం కోసం పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ అందరికీ తెలియదు. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజిలో తీయాల‌ని ఎప్పుడో అనుకున్నాం. భారతీయులంతా నరసింహారెడ్డి గురించి తెలుసుకోవాలి. ఈ కథ చాలా ఏళ్ల క్రితమే నా దృష్టికి వచ్చింది. కానీ ఎక్కువ బడ్జెట్‌ అవుతుందన్న కారణంతో సినిమా తీసే ధైర్యం చేయలేకపోయాను. కానీ ఇప్పుడు రామ్‌ చరణ్‌, సురేందర్‌ రెడ్డి ముందుకొచ్చారు. నా భ‌యాన్ని పోగొట్టారు. భారీ స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దారు. దీంతో నా కల నెరవేరింది" అని చిరు అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English