‘సైరా’లో అన్నీ ఓకే కానీ..

‘సైరా’లో అన్నీ ఓకే కానీ..

మెగా అభిమానుల్ని ప‌ర‌మానందంలో ముంచెత్తింది సైరా న‌ర‌సింహారెడ్డి టీజ‌ర్. ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని రీతిలో టీజ‌ర్ సాగింది. ఈ సినిమా విష‌యంలో కొంత నెగెటివ్ ఆలోచ‌న‌లు ఉన్న వాళ్ల‌ను కూడా టీజ‌ర్ ఆక‌ట్టుకుంద‌నే చెప్పాలి.

వేరే భాష‌ల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ బాగానే ఉంది. బాహుబ‌లికి దీటైన భారీత‌నం విజువ‌ల్స్‌లో క‌నిపించింది. యాక్ష‌న్ ఘ‌ట్టాలు, సెట్టింగ్స్, విజువ‌ల్ ఎఫెక్ట్స్.. ఇవే సినిమాల‌కు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచేలా క‌నిపిస్తున్నాయి.

స్వ‌తంత్ర పోరాటంతో ముడిప‌డ్డ వీరుడి క‌థ కావ‌డంతో ఎమోష‌న్ల‌కు ఢోకా ఉండ‌ద‌నే అనిపిస్తోంది. ఫ్యాన్ మూమెంట్స్‌కు లోటు ఉండ‌ద‌నే సంకేతాల్ని టీజ‌ర్ ఇచ్చింది. మొత్తంగా అక్టోబ‌రు 2న మెగా అభిమానులకే కాదు.. స‌గ‌టు తెలుగు ప్రేక్ష‌కులకూ గూస్ బంప్స్ గ్యారెంటీ అనిపిస్తోంది.

ఐతే ఇప్ప‌టిదాకా విడుద‌లైన ప్రోమోలు చూస్తే అన్నీ బాగున్నాయి.. రెండు విష‌యాల్లో మాత్రం తేడా కొడుతోంది. అవే.. చిరు లుక్, వాయిస్. చిరుకు స్టైలింగ్ చేసింది స్వ‌యంగా ఆయ‌న త‌న‌యురాలే. ఆమె ఖైదీ నంబ‌ర్ 150కి కూడా ప‌ని చేసింది. సైరాకు వేరే నిపుణులు, చ‌రిత్ర‌కారుల సాయం తీసుకుని చిరుకు లుక్ ఫైన‌ల్ చేసిన‌ట్లు స‌మాచారం. కానీ చిరు లుక్ కొన్నిసార్లు బాగానే అనిపిస్తున్నా.. కొన్ని షాట్ల‌తో తేడాగా అనిపించింది.

గ‌త ఏడాది రిలీజ్ చేసిన టీజ‌ర్లోనూ అంతే. లేటెస్ట్ టీజ‌ర్లో అయితే కొన్ని చోట్ల చిరు లుక్స్ కొంచెం ఎబ్బెట్టుగానే క‌నిపించాయి. ఇక వాయిస్ విష‌యంలో ముందు నుంచి ఉన్న ఆందోళ‌న‌ను తాజా టీజ‌ర్ పెంచింది.

చిరు గొంతులో మునుప‌టి గంభీర‌త్వం ఇప్పుడు లేదు. గొంతు కొంచెం బొంగురుపోయి, బ‌ల‌హీన ప‌డింది. ఒక వీరుడి వాయిస్ ఉండాల్సిన‌ట్లుగా లేదు. మ‌రి సినిమా మొత్తంగా చూసిన‌పుడు లుక్, వాయిస్ విష‌యంలో ప్రేక్ష‌కుల ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English