జంజీర్ పీడ‌క‌ల‌ను చ‌ర‌ణ్‌కు గుర్తు చేస్తే..

జంజీర్ పీడ‌క‌ల‌ను చ‌ర‌ణ్‌కు గుర్తు చేస్తే..

తెలుగులో రెండో సినిమా మ‌గ‌ధీర‌తోనే తిరుగులేని స్థాయికి ఎదిగిపోయాడు రామ్ చ‌ర‌ణ్‌. ఆ త‌ర్వాత అత‌ను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. మ‌ధ్య మ‌ధ్య‌లో ఫ్లాప్‌లు వ‌చ్చినా రేంజ్ పెరుగుతూ పోయిందే త‌ప్ప త‌గ్గ‌లేదు.

టాలీవుడ్ కెరీర్ సెట్ అయిపోవ‌డంతో బాలీవుడ్లోనూ పేరు తెచ్చుకోవాల‌ని ఆశ ప‌డ్డాడు మెగాస్టార్ వార‌సుడు. కానీ అక్క‌డ అత‌డికి దారుణ‌మైన ప‌రాభ‌వం ఎదురైంది జంజీర్ రూపంలో. ఈ సినిమా డిజాస్ట‌ర్ కావ‌డం ఒక బాధ అయితే.. చర‌ణ్ గురించి అక్క‌డి విమ‌ర్శ‌కులు అవ‌మాన‌కర వ్యాఖ్య‌లు చేయ‌డం మ‌రో బాధ‌. దీంతో మ‌ళ్లీ బాలీవుడ్ వైపు చూడ‌లేదు. ఎప్పుడైనా మీడియా ఇంట‌ర్వ్యూల్లో జంజీర్ గురించి మాట్లాడేందుకు కూడా చ‌ర‌ణ్ ఇష్ట‌ప‌డేవాడు కాదు.

కానీ ఇప్పుడు త‌న తండ్రి చిరంజీవి న‌టించిన సైరా న‌రసింహారెడ్డి సినిమాను హిందీలోనూ పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తుండ‌టంతో ప్ర‌మోష‌న్ల కోసం ముంబ‌యికి వెళ్ల‌క త‌ప్ప‌లేదు చ‌ర‌ణ్‌కు. ఇక‌ అక్క‌డి మీడియా వాళ్లు జంజీర్ గురించి ఎత్త‌కుండా ఎలా ఉంటారు?

జ‌ంజీర్ అనుభ‌వాన్ని గుర్తు చేస్తూ.. ‘‘మేం మిమ్మల్ని హిందీ సినిమాల్లో చూడాలి అనుకుంటున్నాం. కానీ మీరు ఎందుకు ఇక్కడ నటించేందుకు ఇబ్బందిపడుతున్నారు?’’ అని ఓ విలేకరి చ‌రణ్‌ను ప్రశ్నించాడు.

దీనికి చ‌ర‌ణ్ బ‌దులిస్తూ.. ‘‘నేను హిందీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎప్పుడూ ఇబ్బందిపడలేదు. ‘సైరా’ ఓ మంచి కథ కాబట్టి.. దాన్ని హిందీలో విడుదల చేయబోతున్నాం. సరైన కంటెంట్‌తో రావడం కూడా ముఖ్యం కదా. రాజమౌళి స‌ర్‌తో చేస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాతో వ‌చ్చే ఏడాది హిందీ ప్రేక్ష‌కుల్ని కూడా ప‌ల‌క‌రిస్తాను. బాలీవుడ్లో అది నా కమ్‌బ్యాక్‌ సినిమా అవుతుందని ఆశిస్తున్నా’’ అని చ‌ర‌ణ్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English