‘సాహో’ నుంచి తీసేశారనుకున్నాడట

‘సాహో’ నుంచి తీసేశారనుకున్నాడట

నీల్ నితిన్ ముఖేష్.. బాలీవుడ్లో విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. తమిళంలో ‘కత్తి’ సినిమాతో సౌత్ ప్రేక్షకులకూ చేరువయ్యాడు. తెలుగులో అతను ఇప్పటికే ‘కవచం’ సినిమా చేశాడు. ఐతే దీని కంటే ముందు అతను నటించిన మెగా మూవీ ‘సాహో’ కొంచెం లేటుగా రిలీజవుతోంది.

ఈ సినిమాలో తనకు అవకాశం రాగానే చాలా ఎగ్జైట్ అయ్యానని చెప్పిన నీల్.. కథ నరేట్ చేశాక రెండేళ్ల పాటు చిత్ర బృందం నుంచి ఏ సమాచారం లేకపోవడంతో తనను ఈ సినిమా నుంచి తీసేశారని అనుకున్నట్లుగా చెప్పడం విశేషం. ‘బాహుబలి’ విడుదల కంటే ముందే ‘సాహో’కు సన్నాహాలు మొదలైనప్పటికీ.. ఇంకో మూణ్నాలుగేళ్లకు కానీ ఈ చిత్రం పట్టాలెక్కని సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎందుకు ఆలస్యం అయిందో మనకు తెలుసు కానీ.. నీల్‌కు అది అర్థం కాక అపార్థం చేసుకున్నాడట.

‘‘2015లో బాహుబలి: ది బిగినింగ్ విడుదల కావడానికంటే ముందు ఓ అవార్డు ఫంక్షన్‌లో సుజీత్‌ను కలిశా. కొన్ని రోజుల తర్వాత అతను నాకు ‘సాహో’ కథ చెప్పాడు. కథతో పాటు నాకు పాత్ర నచ్చింది. ఆ తర్వాత ‘బాహుబలి’ విడుదలై బ్లాక్‌బస్టర్‌ అయింది. దీంతో ప్రభాస్ కోసం అందరూ ఎదురు చూడాల్సి వచ్చింది. అతను ‘బాహుబలి 2’ సినిమాలో బిజీ అయిపోయాడు.

నేను వేరే సినిమాల్లో నటించా. రెండేళ్ల పాటు చిత్ర బృందం నుంచి ఏ సమాచారం లేకపోవడంతో ‘సాహో’ నుంచి నన్ను తీసేశారేమో అని భయపడ్డా. కానీ సుజీత్‌ తన మాట నిలబెట్టుకుంటూ నాకు చెప్పిన పాత్రను నాకే ఇచ్చారు’’ అని నీల్ చెప్పాడు. ‘సాహో’ షెడ్యూల్స్ అనుకున్నట్లుగా సాగకపోవడం,

షూటింగ్ ఆలస్యం కావడంతో తాను ఇబ్బంది పడాల్సి వచ్చిందని.. సొంత నిర్మాణ సంస్థలో ‘బైపాస్‌ రోడ్‌’ కోసం బరువు తగ్గాల్సి ఉండటంతో ‘సాహో’ పాత్ర కోసం లుక్ మెయింటైన్ చేయడం కష్టమైందని.. అయినా ఈ ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా ఎలాగోలా అడ్జస్ట్ అయ్యానని చెప్పాడు నీల్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English