అతను లేడే లేడన్నారు.. షూటింగ్‌లో పాల్గొంటున్నాడు

అతను లేడే లేడన్నారు.. షూటింగ్‌లో పాల్గొంటున్నాడు

మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా ఇండస్ట్రీలోకి రాబోతున్న కుర్రాడు వైష్ణవ్ తేజ్ పంజా. సాయిధరమ్ తేజ్‌కు ఇతను తమ్ముడు. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్.. వైష్ణవ్ హీరోగా సినిమా నిర్మించడానికి ముందుకొచ్చింది ఈ చిత్రానికి మెగా ఫ్యామిలీ అండ దండలు బాగానే లభిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ‘సైరా నరసింహారెడ్డి’లో కీలక పాత్ర చేస్తున్న తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి.. వైష్ణవ్ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నట్లుగా వార్త బయటికి రాగానే అందరూ ఎగ్జైట్ అయ్యారు. ఈ సినిమాకు అతను ప్రత్యేక ఆకర్షణ అవుతాడని భావించారు. కానీ ఈ చిత్రం నుంచి కొన్ని కారణాల వల్ల విజయ్ సేతుపతి తప్పుకుంటున్నట్లు రూమర్లు వినిపించాయి. వీటిని చిత్ర బృందం నుంచి ఎవ్వరూ ఖండించకపోవడంతో అది నిజమే అనుకున్నారంతా.

కానీ ‘ఉప్పెన’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈ మధ్యే చడీచప్పుడు లేకుండా షూటింగ్ మొదలుపెట్టుకుంది. ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది. రెండో షెడ్యూల్‌లో విజయ్ సేతుపతి కూడా షూటింగ్‌కి హాజరవుతున్నాడట. చిత్ర బృందానికి చెందిన ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు. విజయ్ సేతుపతి పక్కాగా ఈ సినిమాలో నటిస్తున్నాడట. మరి మధ్యలో ఆ ప్రచారం ఎందుకు జరిగిందో.. దాన్ని చిత్ర బృందం ఎందుకు ఖండించకుండా ఉందో అర్థం కాలేదు.

ఈ సినిమా కోసం ముందు ఎంచుకున్న కథానాయికను కూడా మధ్యలో మార్చారు. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాదే ఈ చిత్రానికి మ్యూజిక్ ఇవ్వనున్నాడు. సుక్కు శిష్యుల్లోకందరికీ బుచ్చిబాబే చాలా టాలెంటెడ్ అని.. బలమైన కథతో అతను రంగంలోకి దిగుతున్నాడని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English