టీజర్‌ టాక్‌: సైరా సురేందర్‌ రెడ్డి!

టీజర్‌ టాక్‌: సైరా సురేందర్‌ రెడ్డి!

సురేందర్‌ రెడ్డికి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌ తీసిన అనుభవం వున్నా, ఎన్టీఆర్‌, మహేష్‌, చరణ్‌లాంటి స్టార్‌ హీరోలని డైరెక్ట్‌ చేసినా కానీ వందల కోట్ల పెట్టుబడితో గ్రాఫిక్స్‌ ప్రధాన సినిమాలు తీసిన ఎక్స్‌పీరియన్స్‌ లేదు. అయినా కానీ సురేందర్‌ రెడ్డి 'సైరా నరసింహారెడ్డి' తీయగలడని నమ్మి రామ్‌ చరణ్‌ అతనికి ఈ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతలు అప్పగించాడు.

చిరంజీవి కూడా కాస్త అనుమాన పడినా కానీ చరణ్‌ మాత్రం అతడు చేయగలడని నమ్మి ఈ చిత్రాన్ని అతని చేతిలో పెట్టాడు. ఈ చిత్రం నిర్మాణం మొదలైన కొద్ది రోజులకే సురేందర్‌ రెడ్డి సినిమా తీయలేకపోతున్నాడంటూ ప్రచారం మొదలు పెట్టారు. కానీ టీజర్‌తోనే సురేందర్‌ సమాధానమిచ్చాడు. ఇలాంటి స్కేల్‌ వున్న సినిమాకి ఎలాంటి టీజర్‌ వదలాలో సురేందర్‌ అచ్చంగా అలాంటి టీజర్‌నే వదిలాడు. ఈ టీజర్‌లోని షాట్స్‌తోనే అతను ఈ చిత్రాన్ని ఎలా హ్యాండిల్‌ చేసాడనేది అర్థమవుతోంది. ఇక పవన్‌కళ్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌ పెట్టాలనేది ఎవరి ఆలోచన అనేది తెలియదు కానీ అది బ్రహ్మాండంగా వర్కవుట్‌ అయింది. మెగా అభిమానులు మరింత ఉర్రూతలూగిపోవడానికి అవకాశం కల్పించింది.

సైరా కూడా బాహుబలి, సాహో చిత్రాల మాదిరిగా పాన్‌ ఇండియా మార్కెట్‌ని కొల్లగొట్టే సత్తా వున్న సినిమా అని ఈ టీజర్‌ చాటి చెప్పింది. నూట యాబై సినిమాల అనుభవం వున్న చిరంజీవి ఇందులోని లీడ్‌ క్యారెక్టర్‌ని తనదైన శైలిలో పండిస్తారనే దాంట్లో ఎవరికీ అనుమానం లేదు. కానీ సురేందర్‌ తనపై వ్యక్తమయిన సందేహాలకి సమాధానం ఇచ్చిన తీరుకి శభాష్‌ అనకుండా వుండలేరు. తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ పోతోన్న సినిమాలలో సైరాకి కూడా చోటు దక్కడం ఖాయమనేంతగా ఈ టీజర్‌తో ఈ చిత్ర బృందం ఆకట్టుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English