సాహో బడ్జెట్‌ తగ్గించిన నారా లోకేష్‌

సాహో బడ్జెట్‌ తగ్గించిన నారా లోకేష్‌

కాంట్రవర్సీకి మించిన పబ్లిసిటీ లేదంటారు. సాహో నిర్మాతలు అలాంటి కాంట్రవర్సీ ఏదీ తమంతట తాముగా క్రియేట్‌ చేయకపోయినా, తమ చిత్రానికి మాత్రం బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ లభిస్తోంది. సాహో చిత్రాన్ని టీడీపీ శ్రేణులు తొక్కేస్తున్నాయనే గాలి వార్త ఒక వెబ్‌సైట్‌లో వచ్చింది. దానికి సరాసరి టీడీపీ అధ్యక్షుడి తనయుడు నారా లోకేష్‌ స్పందించడంతో అది హాట్‌ టాపిక్‌ అయింది.

ఈ వ్యవహారంలో క్లీన్‌ చిట్‌ ఇచ్చుకునే క్రమంలో సాహో కోసం తాను ఎంతగా ఎదురు చూస్తున్నదీ కూడా లోకేష్‌ చెప్పడంతో పబ్లిసిటీకి అది మరింత దోహదపడింది. అన్ని న్యూస్‌ ఛానల్స్‌లో ప్రైమ్‌ టైమ్‌లో కవరేజ్‌ లభించింది. టీడీపీ అనుకూల మీడియాలో అయితే గంటల కొద్దీ చర్చ కూడా జరుగుతోంది. ఇదంతా నిర్మాతలు కొనాలంటే కోట్లు ఖర్చవుతాయి. కానీ పైసా ఖర్చు లేకుండా రెండు రోజులుగా సాహో న్యూస్‌లో నానుతోంది. ఎటు చూసినా సాహో డిస్కషన్‌ హల్‌చల్‌ చేస్తోంది.

పది రోజులలో రిలీజ్‌ పెట్టుకుని ఇంత పబ్లిసిటీ వస్తుందంటే ఏ నిర్మాత మాత్రం హ్యాపీగా వుండడు. సినిమాకి ఏమాత్రం డ్యామేజ్‌ కూడా చేయని పబ్లిసిటీ కావడంతో దక్షిణాదిలో, ముఖ్యంగా తెలుగునాట సరిగా ప్రమోషన్‌ చేయడం లేదనే లోటు కూడా దీంతో తీరిపోయింది. కేవలం మీడియా ద్వారా వచ్చే ప్రచారమే కాకుండా సోషల్‌ మీడియాలో కూడా లోకేష్‌ ట్వీట్‌ హల్‌చల్‌ చేస్తూ సాహోని ట్రెండింగ్‌లో వుంచింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English