సెంటిమెంట్‌కి దూరంగా బాలకృష్ణ!

సెంటిమెంట్‌కి దూరంగా బాలకృష్ణ!

సంక్రాంతికి తన సినిమా విధిగా విడుదలయ్యేలా చూస్తోన్న బాలకృష్ణ వచ్చే సంక్రాంతిపై మాత్రం అంత ఆసక్తిగా లేనట్టు సమాచారం. 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ గత సంక్రాంతికి విడుదలయి నిరాశ పరిచిన పిమ్మట, వచ్చే సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు ఆల్రెడీ బరిలో వున్న కారణంగా బాలయ్య చిత్రం సంక్రాంతికి విడుదల కావడం లేదనేది తాజా రిపోర్ట్‌.

కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న ఈ మాస్‌ చిత్రాన్ని డిసెంబర్‌లోనే విడుదల చేయాలని డిసైడ్‌ అయినట్టు టాక్‌. ఈ చిత్రంలో బాలయ్య వాన్‌ డైక్‌ స్టయిల్‌ గడ్డంతో చాలా స్టయిలిష్‌గా కనిపించబోతున్నారు. బాలకృష్ణ ఇందులో రెండు గెటప్స్‌లో కనిపిస్తారు. ఒకటి కాస్త ఏజ్డ్‌ గెటప్‌ కాగా, మరొకటి యంగ్‌ లుక్‌. ఈ రెండు గెటప్స్‌ ఖాయమైపోయాయి.

ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌లోగా పూర్తి చేసేసి డిసెంబర్‌ మూడవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సంక్రాంతికి బాలకృష్ణకి పెద్ద హిట్లు వున్నప్పటికీ అదే సంఖ్యలో ఫ్లాప్‌ చిత్రాలు కూడా వచ్చాయి.

కనుక సెంటిమెంట్‌ అంటూ భారీగా పోటీ వున్న టైమ్‌లో వెళ్లి థియేటర్ల కొరత సమస్య ఎదుర్కోవడం కంటే క్రిస్మస్‌ వారాంతాన్ని వాడుకోవాలని చూస్తున్నారు. ఆ వారంలో కూడా పలు చిత్రాలు విడుదలకి సిద్ధమవుతున్నా కానీ మాస్‌ చిత్రం ఒక్కటీ లేకపోవడం ఈ చిత్రానికి కలిసి వచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English