ట్రేడ్‌ టాక్‌: రణరంగం డ్రాప్‌.. రాక్షసుడు స్లీపర్‌ హిట్‌!

ట్రేడ్‌ టాక్‌: రణరంగం డ్రాప్‌.. రాక్షసుడు స్లీపర్‌ హిట్‌!

మొదటి రోజున శర్వానంద్‌ సినిమాలలో రికార్డు వసూళ్లు రాబట్టుకున్న రణరంగం 'ఇండిపెండెన్స్‌ డే' హాలిడేని పూర్తిగా క్యాష్‌ చేసుకోగలిగింది. కానీ టాక్‌ అనుకూలంగా లేకపోవడంతో వారాంతంలో అంతగా ప్రభావం చూపించలేకపోయింది. తొలి రోజున వచ్చిన వసూళ్లని మిగిలిన మూడు రోజుల్లో సాధించలేకపోయింది. సోమవారం వసూళ్లు అన్ని చోట్ల గణనీయంగా పడిపోయాయి.

దీంతో రణరంగం ముందుకి సాగడం కష్టమని ట్రేడ్‌ అంటోంది. ఎవరు స్టడీ కలక్షన్లతో బ్రేక్‌ ఈవెన్‌ దిశగా సాగుతోంది. రాక్షసుడు తర్వాత వచ్చిన సినిమాలలో ఎవరు మినహా అన్నీ నిరాశపరచడంతో అది నెమ్మదిగా స్లీపర్‌ హిట్‌ అయ్యే అవకాశాలు మెరుగయ్యాయి. రాక్షసుడుకి ఇప్పటికీ స్టడీ కలక్షన్లు వస్తున్నాయి. సాహో వచ్చే వరకు అడ్డు లేదు కనుక ఎవరు, రాక్షసుడు రెండూ ఈజీగా హిట్‌ స్టేటస్‌ని అందుకోగలుగుతాయి. ఇకపోతే సాహో రిలీజ్‌ అయ్యే నాటికి థియేటర్లు హోల్డ్‌ చేయడానికి ఏ సినిమా వుండదు.

కనుక తొంభై నుంచి తొంభై అయిదు శాతం థియేటర్లలో సాహో రిలీజ్‌ అవడం ఖాయమంటున్నారు. విపరీతమైన హైప్‌తో వస్తోన్న ఈ చిత్రానికి విడుదలకి ముందు  రోజే బాహుబలి 2 మాదిరిగా పెయిడ్‌ ప్రీమియర్లు వేయనున్నారు. మొదటి రోజు రికార్డులన్నీ సాహో వశం కావడం ఖాయమని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English