మళ్లీ నువ్వే రక్షించాలి నానీ

మళ్లీ నువ్వే రక్షించాలి నానీ

చంద్రశేఖర్ యేలేటి లాంటి మాస్టర్ డైరెక్టర్ దగ్గర శిష్యరికం చేసి.. ‘అందాల రాక్షసి’ లాంటి అభిరుచి ఉన్న సినిమాతో మెగా ఫోన్ పట్టిన దర్శకుడు హను రాఘవపూడి. తొలి సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోయినా.. అతడి ప్రతిభేంటో చాటిచెప్పింది. దీంతో నేచురల్ స్టార్ నాని అతడికి ఛాన్స్ ఇచ్చాడు. 14 రీల్స్ లాంటి పెద్ద సంస్థ వీళ్ల కలయికలో ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రాన్ని ఏమాత్రం రాజీ లేకుండా నిర్మించింది.

ఈ సినిమా చూస్తే హను.. గురువుకు తగ్గ శిష్యుడు అవుతాడనిపించింది. కానీ ‘లై’, ’పడి పడి లేచె మనసు’ సినిమాలతో నిర్మాతల్ని నిలువునా ముంచి.. మిగతా ప్రొడ్యూసర్లు అతడి పేరు చెబితే బెంబేలెత్తిపోయేలా చేశాడు హను. ‘లై’, ‘పడి పడి..’ సినిమాలు చూస్తే హను గురించి జాలి పడాల్సింది కూడా ఏమీ లేదనిపిస్తుంది. స్క్రిప్టు మీద సరైన కసరత్తు చేయకుండా.. అనవసర ఖర్చుతో హడావుడి చేసి నిర్మాతల్ని ప్రమాదంలోకి నెట్టాడతను.

హను సినిమాలన్నీ గమనిస్తే.. ఒక దశ వరకు బాగానే అనిపిస్తాయి. కానీ ద్వితీయార్ధం నుంచి ముందుకు సాగేకొద్దీ సినిమా గ్రాఫ్ పడిపోతుంది. చివరికి బ్యాడ్ ఫీలింగ్‌తో బయటికి వస్తాం. ఈ విషయంలో లోపాల్ని దిద్దుకోవడంలో అతను విఫలమయ్యాడు. ‘పడి పడి లేచె మనసు’ భారీ నష్టాలు మిగిల్చిన నేపథ్యంలో హనుతో సినిమా చేయడానికి నిర్మాతలు, హీరోలెవరూ ఆసక్తి చూపించట్లేదు.

ఇలాంటి సమయంలో ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ను తనను ఆదుకున్న నానీనే హను నమ్ముకున్నట్లు సమాచారం. ‘పడి పడి..’ పరాజయం నుంచి కోలుకుని మళ్లీ ఓ కథ రాసి.. దాన్ని నానీకి నరేట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడట హను. నాని ఓకే అంటే ఇద్దరూ కలిసి నిర్మాత కోసం ప్రయత్నించాలన్నది ప్లాన్. మరి నేచురల్ స్టార్ హనుతో రిస్కుకి రెడీ అవుతాడో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English