10 కోట్ల ఆఫర్ వదిలేసిందట.. నిజమా, ప్రచారమా?

10 కోట్ల ఆఫర్ వదిలేసిందట.. నిజమా, ప్రచారమా?

శిల్పాశెట్టికి బాలీవుడ్ నటిగా వచ్చిన పేరు కంటే.. ‘బిగ్ బ్రదర్’ షోలో అక్కడి లోకల్ సెలబ్రెటీ చేతిలో అవమానపడటం ద్వారా వచ్చిన సింపతీ వల్ల వచ్చిన పాపులారిటీ ఎక్కువ. దీన్ని ఉపయోగించుకుని ఆమె తన స్థాయినే మార్చేసుకుంది. నటిగా ఉన్నప్పటి కంటే పెద్ద సెలబ్రెటీ అయిపోయింది. రాజ్ కుంద్రా అనే వ్యాపారవేత్తను పెళ్లాడి ఇంకా పెద్ద రేంజికి వెళ్లిపోయింది.

నటిగా కెరీర్ ముగిశాక ఫిట్నెస్ పాఠాల మీద దృష్టిపెట్టి ఆ రంగంలో మంచి పేరు సంపాదించింది. ఐతే శిల్పా శెట్టికి ప్రచార యావ ఎక్కువని.. ఈ విషయంలో ఏ చిన్న అవకాశం వచ్చినా ఆమె వదులుకోదని అంటుంటారు. ‘బిగ్ బద్రర్’ నుంచి కొన్ని ఉదంతాల్ని పరిశీలిస్తే అది నిజమే అనిపిస్తుంది. తాజాగా ఆమె తాను కట్టుబడిన విలువల కోసం రూ.10 కోట్ల ఆఫర్ వదులుకున్నట్లుగా మీడియాలో ప్రచారం చేసుకుంటుండటం చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే..

తాజాగా ఓ ఆయుర్వేదిక్ సంస్థ బరువు తగ్గించే తమ ప్రోడక్ట్‌కి ప్రచార కర్తగా ఉండమని శిల్పాను అడిగితే శిల్పాశెట్టి తిరస్కరించిందట. ఆ సంస్థ రూ.10 కోట్ల భారీ పారితోషకం ఆఫర్ చేసినా శిల్ప ఒప్పుకోలేదట. దీనికి కారణం ఏంటని శిల్పాను అడిగితే.. ‘‘నేను నమ్మని సిద్ధాంతాన్ని నేను ప్రచారం చేయను. టాబ్లెట్స్ వేసుకోవడం వలన స్లిమ్‌గా తయారవడం జరగని పని, ఒకవేళ ఆలా జరిగినా అది ఆరోగ్యానికి మంచిది కాదనే అర్థం. క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యరకరమైన ఆహారపు అలవాట్లు మాత్రమే ధీర్ఘకాలపు ఫలితాలను ఇస్తాయి’’ అంటూ సదరు సంస్థ ఉద్దేశాలేంటో చెప్పకనే చెప్పింది శిల్పా.

 ఐతే శిల్పాకు ఉన్న ట్రాక్ రికార్డు ప్రచారం చూస్తే ఆమె సిద్ధాంతాలు, విలువలు అంటుంటే ఒకింత ఆశ్చర్యంగానే కనిపిస్తోంది. నిజంగా శిల్పాకు రూ.10 కోట్ల ఆఫర్ వచ్చి ఉంటుందా అన్నది ఒక సందేహం అయితే.. ఈ విషయాన్ని ఆమె అతిగా ప్రచారం చేసుకుని పాపులారిటీ పొందాలని చూస్తోందంటూ కొందరు విమర్శిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English