సాహోకి చరణ్‌ సాయం చేసాడా?

సాహోకి చరణ్‌ సాయం చేసాడా?

యువి క్రియేషన్స్‌ పార్టనర్స్‌లో ఒకరు రామ్‌ చరణ్‌కి జిగ్రీ దోస్తు. ప్రభాస్‌తో కూడా చరణ్‌కి మంచి స్నేహం వుంది. అలాగే యువి క్రియేషన్స్‌తో కూడా అతనికి సత్సంబంధాలున్నాయి. త్వరలో చరణ్‌తో ఒక సినిమాకి యువి ప్లాన్‌ చేస్తోంది. చరణ్‌ సినిమాలని వీరు తరచుగా కొనడం, వారు నష్టపోతే చరణ్‌ ఆదుకోవడం కూడా జరిగింది.

ఇదిలావుంటే సాహో చిత్రానికి తమ పరిధులకి మించి బడ్జెట్‌ పెట్టిన యువి క్రియేషన్స్‌ అధినేతలు ఒకానొక టైమ్‌లో ఆర్థికంగా ఒత్తిడికి లోనయ్యారట. ఆ టైమ్‌లో చరణ్‌ అండగా నిలిచాడని, ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకుండా సాహో ముందుకి సాగడానికి సహకరించాడని భోగట్టా.

అయితే చరణ్‌ ఇచ్చిన డబ్బుని సాయంగా కాకుండా వాటాగా తీసుకుంటామని వారు ప్రపోజల్‌ పెట్టడం, దానికి చరణ్‌ కూడా ఓకే అనడం అప్పుడే జరిగిందట. కానీ ఇందులో తన పెట్టుబడి వున్న విషయాన్ని చరణ్‌ ఎందుకో గోప్యంగానే వుంచమన్నాడట. రిలీజ్‌కి దగ్గర పడుతోన్న దశలో ఈ రూమర్‌ లీక్‌ అయింది. ఈ చిత్రానికి వచ్చే లాభాల్లో చరణ్‌కి పది శాతం వాటా వుంటుందనేది గాసిప్‌ వర్గాల మాట.

దీనిపై ఇంకా యువి కానీ, చరణ్‌ కానీ స్పందించలేదు కానీ ఈ చిత్రం ప్రమోషన్స్‌ విషయంలో చరణ్‌ ఆసక్తి కనబరుస్తున్నాడనే టాక్‌ అయితే బాగా వుంది. అయితే అదంతా సైరా కోసం స్టడీ చేస్తున్నాడని అనుకున్నారు కానీ అసలు సంగతి ఇదట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English