హిందీకి 85 కోట్లు.. తెలుగు+తమిళం+మలయాళం 110 కోట్లు

హిందీకి 85 కోట్లు.. తెలుగు+తమిళం+మలయాళం 110 కోట్లు

‘సాహో’ థియేట్రికల్ హక్కులకు సంబంధించిన ముచ్చట్లను ఇప్పటికే మాట్లాడుకున్నాం. దాదాపు రూ350 కోట్ల మేర ఈ చిత్రం బిజినెస్ చేసినట్లు అంచనా. శాటిలైట్, డిజిటల్ హక్కుల సంగతే తేలాల్సి ఉంది. వీటికి సంబంధించి వస్తున్న తాజా అప్ డేట్స్ చేస్తే ట్రేడ్ పండిట్లకు కూడా దిమ్మదిరిగిపోతోంది. బాలీవుడ్లో ‘సాహో’కు మామూలు క్రేజ్ లేదని అర్థమవుతోంది. ఇప్పటికే రూ.120 కోట్లకు థియేట్రికల్ హక్కుల్ని అమ్మారు హిందీలో.

ఇప్పుడు హిందీ వెర్షన్ శాటిలైట్, డిజిటల్ హక్కులు కలిపి రూ.85 కోట్లకు అమ్మినట్లుగా వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. బాలీవుడ్ బడా హీరోల సినిమాలకు మాత్రమే పలికే రేటిది. అందులోనూ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి వాళ్లు మాత్రమే ఈ రేటు రాబట్టగలరు. ‘బాహుబలి’తో తర్వాత వచ్చిన క్రేజ్‌తో ‘సాహో’కు కూడా ఈ రేటు సంపాదించగలగడం ప్రభాస్‌కే చెల్లింది.

తెలుగు, తమిళం, మలయాళ భాషలకు కలిపి ‘సాహో’ శాటిలైట్, డిజిటల్ హక్కుల్ని ఏక మొత్తంగా అమ్మేయడానికి యువి క్రియేషన్స్ చూస్తోందట. దీని కోసం ఏకంగా రూ.110 కోట్ల రేటు పెట్టినట్లు సమాచారం. ఈ డీల్ ఇంకా పూర్తి కాలేదట. సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటంతో కచ్చితంగా ఈ ప్రైస్ వర్కవుట్ అవుతుందనే భావిస్తున్నారట నిర్మాతలు. విడుదలకు ముందు డీల్ సెట్ కాకపోయినా.. రిలీజ్ తర్వాత సినిమాకు పెరిగే హైప్ చూసి కచ్చితంగా బయ్యర్లు ముందుకు వస్తారని భావిస్తున్నట్లు సమాచారం.

‘సాహో’ తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులు మాత్రమే రూ.125 కోట్ల దాకా పలికినట్లుగా వార్తలొస్తున్నాయి. దక్షిణాదిన మిగతా మూడు భాషల్లో కలిపి ఈ చిత్రం రూ.50 కోట్లకు అటు ఇటుగా రాబడుతోంది. మొత్తంగా సినిమా బిజినెస్ రూ.450కు పైమాటే అన్నది ట్రేడ్ వర్గాల సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English