సాహో పాటలన్నీ తీసేస్తే బెటరేమో

సాహో పాటలన్నీ తీసేస్తే బెటరేమో

సాహో సినిమా నుంచి ఇప్పటికే రెండు వీడియో సాంగ్స్ చూశాం. తాజాగా ‘బ్యాండ్ బాయ్’ అంటూ ఇంకో పాట రిలీజ్ చేశారు. మొత్తంగా ఏ పాట కూడా వినడానికి ఏమంత శ్రావ్యంగా లేవు. విజువల్స్ కూడా మామూలుగానే అనిపించాయి. రిచ్ లొకేషన్లలో బాగా ఖర్చు పెట్టి తీశారు తప్పితే.. వాటిలో ఏ రకమైన క్రియేటివిటీ కనిపించలేదు.

ప్రేక్షకుల్ని కాసేపు ఎంగేజ్ చేసేలా ఏ పాటా లేదు. ప్రభాస్ ఏమైనా అలరించాడా అంటే అదీ లేదు. పాటల్లో ప్రభాస్ లుక్స్ అంతంతమాత్రంగా ఉన్నాయి. శ్రద్దా కపూర్‌లో మామూలుగా గ్లామర్ పాళ్లు తక్కువ. ఆమె ఏమీ పాటల్లో మెస్మరైజ్ చేసింది లేదు. తాజాగా రిలీజ్ చేసిన పాటలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పర్వాలేదనిపించింది. మొత్తంగా ఈ పాటలన్నీ చూస్తే సినిమాకు ఏ రకంగా అయినా ఉపయోగపడతాయా అన్నది సందేహంగానే ఉంది.

హాలీవుడ్లో వచ్చిన మిషన్ ఇంపాజిబుల్, మ్యాడ్ మ్యాక్స్ లాంటి సూపర్ యాక్షన్ థ్రిల్లర్ల తరహాలో కనిపిస్తోంది ‘సాహో’. వాటికి దీటైన పేస్‌తో, విజువల్ మాయాజాలంతో, యాక్షన్‌తో సాగే సినిమాలా కనిపిస్తోంది. టీజర్, ట్రైలర్ చూస్తే హాలీవుడ్ సిినిమాలకు దీటైన పేస్ కనిపించింది. కానీ ఆ సినిమాల మాదిరి ఫ్లోలో సాగాలంటే పాటలు ఉండకూడదు. ఇప్పుడు చూసిన పాటలన్నీ కూడా సినిమా ఫ్లోను దెబ్బ తీసేలాగే ఉన్నాయి.

ప్రేక్షకులంతా ఉత్కంఠలో ఉండగా ఇవొచ్చి మూడ్ పాడు చేస్తాయేమో.. థియేటర్ల నుంచి లేచి కాసేపు పక్కకు వెళ్లేలా చేస్తాయేమో అనిపిస్తోంది. సినిమా నిడివి పెరగడానికి తప్పితే పాటలు ఇంకే రకంగానూ ఉపయోగ పడేలా లేవు. కాబట్టి ఫైనల్ కట్ చూసుకున్నపుడు పాటల దగ్గర కొంచెం కఠినంగా వ్యవహరిస్తేనే మంచిదేమో. విడుదల తర్వాత యూట్యూబ్‌లో రిలీజ్ చేసుకుంటే ఎలాగూ మంచి వ్యూస్ వస్తాయి. అంతకుమించి కావాల్సిందేముంది?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English