ప్ర‌భాస్ స్పెషాలిటీ చెప్పిన రాజ‌మౌళి

ప్ర‌భాస్ స్పెషాలిటీ చెప్పిన రాజ‌మౌళి

టాలీవుడ్లో స్టార్ హీరోల‌కూ అభిమానులుంటారు. అలాగే యాంటీ ఫ్యాన్స్  కూడా ఉంటారు. ఐతే త‌క్కువ నెగెటివిటీ ఉన్న స్టార్ల‌లో ప్ర‌భాస్ ఒక‌డ‌ని క‌చ్చితంగా చెప్పొచ్చు. మిగ‌తా స్టార్ల‌తో పోలిస్తే అత‌డిని వ్య‌తిరేకించేవాళ్లు త‌క్కువ‌గానే క‌నిపిస్తారు. ప్ర‌భాస్ మీద సోష‌ల్ మీడియాలో వ్య‌తిరేక ప్ర‌చారాలు త‌క్కువ‌గానే జ‌రుగుతుంటాయి. అత‌డి సినిమా హిట్ట‌యితే అంద‌రూ సంతోషిస్తుంటారు.

ఇదే విష‌యాన్ని సాహో ప్రి రిలీజ్ ఈవెంట్లో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి చెప్పాడు. టాలీవుడ్లో ప్ర‌తి హీరోకూ ఫ్యాన్స్ ఉంటార‌ని.. వాళ్లు త‌మ హీరో సినిమా ఆడాల‌ని కోరుకుంటార‌ని.. కానీ అంద‌రు హీరోల అభిమానులూ ప్ర‌భాస్ సినిమా బాగా ఆడాల‌ని ఆశిస్తార‌ని.. అదే అత‌డి ప్ర‌త్యేక‌త అని చెప్పాడు జ‌క్క‌న్న‌.

బాహుబ‌లి త‌ర్వాత ఏ సినిమా చేయాల‌నే విష‌యంలో చాలా ముందు నుంచే ప్ర‌భాస్ ఎంతో ఆలోచించాడ‌ని.. అది అత‌డి దూర‌దృష్టికి నిద‌ర్శ‌న‌మ‌ని అన్న ప్ర‌భాస్.. బాహుబ‌లి త‌ర్వాత పెద్ద ద‌ర్శ‌కుడితో సినిమా చేయాల‌నుకోకుండా క‌థ‌కు ప్రాధాన్యం ఇచ్చి సుజీత్ లాంటి కుర్ర ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌డం గొప్ప విష‌య‌మ‌ని అన్నాడు రాజ‌మౌళి.

సుజీత్ చిన్న‌వాడైనా ఇంత పెద్ద ప్రాజెక్టును అద్భుతంగా డీల్ చేశాడ‌ని.. ఈ సినిమాకు మూల స్తంభం అత‌డ‌ని.. సినిమాను త‌న భుజాల మీద మోశాడ‌ని రాజ‌మౌళి కితాబిచ్చాడు. యువి క్రియేష‌న్స్ అధినేత‌ల‌ది చాలా పెద్ద మ‌న‌స‌ని.. ప్ర‌భాస్ కోసం వాళ్లు ఏం చేయ‌డానికైనా సిద్ధ‌మ‌ని.. సాహో కోసం ఇంత ఖ‌ర్చు పెట్ట‌డం గొప్ప విష‌య‌మ‌ని అన్నాడు రాజ‌మౌళి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English