రష్మిక అత్యుత్సాహం.. దర్శక నిర్మాతల షాక్

రష్మిక అత్యుత్సాహం.. దర్శక నిర్మాతల షాక్

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది రష్మిక. తన సినిమాలకు సంబంధించిన ముచ్చట్లు చాలానే చెబుతుంటుంది. అప్ డేట్స్ పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తన కొత్త సినిమా గురించి ఓ విశేషాన్ని బయటపెట్టేయడం చిత్ర బృందానికి రుచించలేదని సమాచారం. తమిళంలో రష్మిక తొలిసారిగా ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో కార్తి కథానాయకుడు. ఈ సినిమాకు చిత్ర బృందం ‘సుల్తాన్’ అనే టైటిల్ అనుకుంటోందట.

ఈ పేరుతో దశాబ్దం కిందట రజనీకాంత్ ఓ సినిమా చేయడం.. తర్వాత దాని టైటిల్‌ను ‘కోచ్చడయాన్/విక్రమసింహా’గా మార్చి.. సినిమాను మరోలా ప్రొజెక్ట్ చేయడం తెలిసిన సంగతే. దీంతో ‘సుల్తాన్’ టైటిల్‌ను ఇప్పుడు కార్తి చిత్రానికి పెట్టాలనుకున్నారు. ఐతే త్వరలోనే టైటిల్ పోస్టర్‌ను అధికారికంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

ఐతే ఈ లోపే రష్మిక ఈ సినిమా ముచ్చట్లను ట్విటర్లో పంచుకుంటూ సినిమా పేరు ‘సుల్తాన్’ అని చెప్పేసింది. దీంతో కార్తి కొత్త సినిమా టైటిల్ ‘సుల్తాన్’ అభిమానులు దాన్ని వైరల్ చేశారు. ఐతే సినిమాలో నటిస్తూ ముఖ్యమైన సమాచారం విషయంలో గోప్యత పాటించాలన్న నియమాన్ని రష్మిక ఉల్లంఘించడంతో చిత్ర దర్శక నిర్మాతలకు కోపం వచ్చిందట. ఏంటీ పని అంటూ ఆమెను మందలించినట్లు తెలుస్తోంది. ఆమె సారీ చెప్పడంతో వ్యవహారం సద్దుమణిగిందట.

తమిళంలో తొలి సినిమా రిలీజ్ కాకముందే రష్మిక.. విజయ్ లాంటి పెద్ద హీరో సరసనా ఓ అవకాశం పట్టేసినట్లుగా వార్తలొస్తున్నాయి. తెలుగులో ఆమె ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో క్రేజీ ఆఫర్లు వస్తుండటం, భారీగా పారితోషకాలు కూడా దక్కుతుండటంతో కన్నడ సినిమాలకు రష్మిక అందుబాటులో ఉండట్లేదని అక్కడి వాళ్లు వాపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English