నాని కూడా ఓ యాడ్ చేశాడు.. చూశారా?

నాని కూడా ఓ యాడ్ చేశాడు.. చూశారా?

ఇంత‌కుముందు మ‌న టాలీవుడ్ స్టార్ల‌కు ప్ర‌క‌ట‌న‌లంటే చిన్న చూపు ఉండేది. మ‌న రేంజేంటి యాడ్స్ చేయ‌డ‌మేంటి అన్న‌ట్లుగా వాటికి దూరంగా ఉండేవాళ్లు. ఐతే బాలీవుడ్ హీరోలు సినిమాల ఆదాయాన్ని మించి కొన్ని రెట్లు ఎక్కువ మొత్తం ప్ర‌క‌ట‌న‌ల ద్వారా సంపాదిస్తూ ఇంకా ఇంకా పాపులారిటీ సంపాదించుకుంటున్న విష‌యం ఆల‌స్యంగా గ్ర‌హించి మ‌న హీరోలు కూడా అప్ర‌మ‌త్తం అయ్యారు.

మ‌హేష్ బాబు, నాగార్జున లాంటి వాళ్లు యాడ్స్ మీద బాగా ఫోక‌స్ పెట్టి వాటి ద్వారా ఉన్న లాభాలు అంద‌రికీ తెలిసేలా చేశారు. ఇప్పుడు దాదాపుగా మ‌న స్టార్లంద‌రూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ బాగానే ఆర్జిస్తున్నారు. ఈ వ‌రుస‌లోకి నేచుర‌ల్ స్టార్ నాని కొంచెం లేటుగా వ‌చ్చి చేరాడు.

నాని తొలిసారిగా చేసిన క‌మ‌ర్షియ‌ల్ స్ప్రైట్ సాఫ్ట్ డ్రింక్‌ది కావ‌డం విశేషం. కూల్ డ్రింగ్ యాడ్ అంటే యూత్‌కు బాగా క‌నెక్ట్ అయ్యే హీరోను ఎంచుకుంటారు. హీరోలు కూడా ఇవి చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఆల్రెడీ మ‌హేష్ థ‌మ్స‌ప్‌కి, అల్లు అర్జున్ 7అప్, ఫ్రూటీ యాడ్ల‌కు ప్ర‌చారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

నానితో రూపొందించిన యాడ్ ట్రెండీగానే ఉండి కుర్ర‌కారును ఆక‌ట్టుకుంటోంది. త‌నదైన‌ వాయిస్ మాడ్యులేష‌న్‌తో, ఫీల్‌తో ఈజీగా అట్రాక్ట్ చేసే నాని.. ఈ ప్ర‌క‌ట‌న‌లో చెప్పిన వాయిస్ ఓవ‌ర్‌తోనే స‌గం స‌క్సెస్ అయిపోయాడు. ప్ర‌క‌ట‌న‌లో అత‌డి లుక్ మాత్రం మామూలుగానే ఉంది. నేరుగా టాప్ బ్రాండ్‌తో మొద‌లుపెట్టిన నాని.. మున్ముందు మరిన్ని ప్ర‌క‌ట‌న‌ల‌తో అల‌రించ‌బోతున్న‌ట్లే, భారీగా ఆర్జించ‌బోతున్న‌ట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English