ఈ డైరెక్టర్‌కి ఎవరైనా మంచి స్టోరీ ఇవ్వండయ్యా

ఈ డైరెక్టర్‌కి ఎవరైనా మంచి స్టోరీ ఇవ్వండయ్యా

‘స్వామి రారా’ లాంటి సూపర్ హిట్‌తో దర్శకుడిగా పరిచయమయ్యాడు సుధీర్ వర్మ. అప్పటికి నిఖిల్ వరుస ఫ్లాపుల్లో పడి కొట్టుమిట్టాడుతున్నాడు. స్వాతికి కూడా పెద్దగా క్రేజ్ లేదు. ఇలాంటి కాంబినేషన్లో చాలా కాన్ఫిడెంట్‌గా ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ తీసి మెప్పించాడు సుధీర్. ఆ సినిమా చూశాక టాలీవుడ్‌కు ఒక ప్రతిభావంతుడైన యువ దర్శకుడు దొరికాడని అంతా సంతోషించారు.

 అతడి మీద ప్రేక్షకులే కాదు.. ఇండస్ట్రీ కూడా చాలా అంచనాలు పెట్టుకుంది. అక్కినేని నాగార్జున పిలిచి.. తన పెద్ద కొడుకుతో ‘దోచేయ్’ సినిమా తీయించాడు. మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. ఆ తర్వాత ‘కేశవ’కూ మంచి క్రేజ్ వచ్చింది. కానీ అదీ నిలబడలేదు. ఇప్పుడు ‘రణరంగం’ పరిస్థితీ అంతే. విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ చూసి ఏదో అనుకుంటే సినిమా ఆ స్థాయిలో లేదు.

సుధీర్ సినిమాలన్నింటినీ కనిపిస్తే అతడి ప్రెజెంటేషన్ సూపర్ అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. టెక్నికల్‌గా బ్రిలియంట్ అన్న మాట వినిపిస్తుంది. సుపీరియర్ క్వాలిటీతో సినిమాలు రూపొందిస్తాడు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఇతర సాంకేతిక అంశాలు టాప్ నాచ్‌లో కనిపిస్తాయి. సినిమాలో ఏ సన్నివేశానికి ఆ సన్నివేశాన్ని చాలా బాగా ప్రెజెంట్ చేస్తాడు. కాకపోతే కథ దగ్గరికొచ్చేసరికి తేడా కొట్టేస్తుంది. హాలీవుడ్ నుంచో లేదంటే మన దగ్గరే ఇంకేదైనా సినిమా నుంచే స్ఫూర్తి కనిపిస్తుంది.

మొత్తంగా చూస్తే టేకింగ్‌లో చూపించే ప్రతిభ స్క్రిప్టు దగ్గర చూపించట్లేదు సుధీర్. అతడికి మంచి కథ పడితే.. దాన్ని అదిరిపోయేలా తీయగలడని స్పష్టమవుతోంది. కాబట్టి ఈసారి సొంత కథను నమ్ముకోకుండా రైటర్లను నమ్ముకుని మంచి కథ చేయించగలిగి.. దాన్ని తనదైన శైలిలో ప్రెజెంట్ చేయగలిగితే మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి స్కోప్ ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English