ప్ర‌భాస్.. వ‌న్ అండ్ ఓన్లీ

ప్ర‌భాస్.. వ‌న్ అండ్ ఓన్లీ

మ‌న థియేట‌ర్ల‌లో మ‌హా అయితే గ‌రిష్టంగా ఎన్ని సీట్లుంటాయి? ఒకేసారి ఎంత‌మంది సినిమా చూడొచ్చు?  800? 1000? 1200? ఐతే ఒక థియేట‌ర్లో 2800 మంది కూర్చుని సినిమా చూస్తే ఎలా ఉంటుంది? ఆ స్థాయి కెపాసిటీ అంటే.. ఆ థియేట‌ర్ ఎంత పెద్ద‌గా ఉంటుంది?

ఒక‌సారి ఊహించుకుని చూడండి. ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ న‌గ‌రంలో ది గ్రాండ్ రెక్స్ అనే థియేట‌ర్ విశిష్ఠ‌త ఇది. ప్ర‌పంచంలోనే ఇది అతి పెద్ద థియేట‌ర్. ఇందులో సినిమా ప్ర‌ద‌ర్శితం అయితే దాన్ని ఒక గౌర‌వంగా భావిస్తారు.

అలాంటి థియేట‌ర్లో ఇప్ప‌టిదాకా ప్ర‌ద‌ర్శిత‌మైన ఇండియ‌న్ సినిమాలు కేవ‌లం మూడు మాత్ర‌మే. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌బాలి.. మన బాహుబ‌లి.. విజ‌య్ మూవీ మెర్శ‌ల్‌ల‌కు మాత్ర‌మే ఈ గౌర‌వం ద‌క్కింది.

ఇప్పుడు మ‌రో ఇండియ‌న్ మూవీ ఆ మెగా థియేట‌ర్లో ప్ర‌ద‌ర్శితం కాబోతోంది. అదే.. సాహో. ఈ నెల 30 నుంచి ఈ చిత్రాన్ని ది గ్రాండ్ రెక్స్‌లో ప్ర‌ద‌ర్శించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డైంది. ఈ థియేట‌ర్లో ఒక ఇండియ‌న్ హీరోకు సంబంధించిన‌ రెండో సినిమా ప్ర‌ద‌ర్శించ‌బోతుండ‌టం ఇదే తొలిసారి.

ఆమిర్ ఖాన్.. స‌ల్మాన్ ఖాన్ లాంటి బ‌డా స్టార్ల సినిమాలే ఒక్క‌సారి కూడా ప్ర‌ద‌ర్శితం కాని చోట ప్ర‌భాస్ చిత్రాలు రెండు ఆడ‌టం అంటే చిన్న విష‌యం కాదు. ఇంకా ప్ర‌పంచ‌వ్యాప్తంగా సాహోను వందల థియేట‌ర్ల‌లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

బాహుబ‌లికి ఏమాత్రం త‌గ్గ‌ని స్థాయిలో విదేశాల్లో ఈ చిత్రానికి స్క్రీన్లు ద‌క్కే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. క‌నీసం ప‌ది వేల థియేట‌ర్ల‌లో ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ట్లు స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English