శర్వా కోసం రవితేజ త్యాగం చేశాడు

శర్వా కోసం రవితేజ త్యాగం చేశాడు

యువ దర్శకుడు సుధీర్ వర్మ ‘కేశవ’ సినిమా చేస్తున్న సమయంలో.. అతడి తర్వాతి చిత్రం రవితేజతో ఉండొచ్చని ఒక ప్రచారం జరిగింది. ఇద్దరి మధ్య కథా చర్చలు జోరుగా సాగుతున్నాయని.. త్వరలోనే వీళ్ల కలయికలో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. కానీ తర్వాత ఏమైందో ఏమో ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. కట్ చేస్తే శర్వానంద్‌తో సుధీర్ తన తర్వాతి చిత్రం చేశాడు. అదే.. రణరంగం.

ఐతే రవితేజకు చెప్పిన కథనే శర్వాకు చెప్పి ఈ సినిమా చేశాడంటూ ఒక ప్రచారం ఉంది. ఇది నిజమే అని స్వయంగా సుధీరే చెప్పడం విశేషం. తాను రాసిన గ్యాంగ్ స్టర్ స్టోరీని ముందు రవితేజకే చెప్పానని.. ఆయనకు బాగా నచ్చిందని.. దాని మీద వర్క్ చేయమని చెప్పాడని.. ఐతే తమ కలయికలో వెంటనే సినిమా పట్టాలెక్కే అవకాశం లేకపోయిందని సుధీర్ చెప్పాడు.

తర్వాత తాను శర్వాను కలిసి వేరే కథ చెప్పానని.. కానీ అది అతడికి నచ్చలేదని.. ఆ తర్వాత ‘రణరంగం’ కథ చెబితే బాగా కనెక్ట్ అయ్యాడని.. అదే చేద్దాం అన్నాడని సుధీర్ వెల్లడించాడు. దీంతో రవితేజ దగ్గరికెళ్లి ఈ కథ శర్వాకు బాగా నచ్చిందని చెప్పగా.. మనం వేరే కథ చేద్దాం ప్రొసీడ్ అని చెప్పి పెద్ద మనసును చాటుకున్నాడని సుధీర్ తెలిపాడు. మొత్తానికి సామరస్య పూర్వకంగా మేటర్ సెటిలైపోయింది. రవితేజ చేయాల్సిన కథలో శర్వా కనిపిస్తున్నాడు.

మరి ఈ సినిమా మిస్సయినందుకు రవితేజ రిగ్రెట్ అవుతాడా.. చేయకపోవడమే మంచిదైందని అనుకుంటాడా అన్నది శుక్రవారం తేలిపోతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో శర్వా రెండు షేడ్స్ ఉన్న గ్యాంగ్‌స్టర్ పాత్ర చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చగా.. దివాకర్ మణి ఛాయాగ్రహణం అందించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English