సాహో బిజినెస్.. జస్ట్ 400 కోట్లు

సాహో బిజినెస్.. జస్ట్ 400 కోట్లు

ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా సినీ ప్రేక్షకుల్లో ‘సాహో’ ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ట్రైలర్ చూశాక ఈ సినిమాకు ఎంత ఖర్చు పెట్టి ఉంటారబ్బా అనే సందేహం అందరినీ వెంటాడుతోంది. బడ్జెట్ రూ.350 కోట్లంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇది ఎగ్జాజరేషన్ అని కొందరంటుంటే.. అంత ఖర్చు పెట్టకుండా ఆ ఔట్ పుట్ తీసుకురావడం కష్టమని.. అది నిజమే అయి ఉంటుందని అంటున్నారు ఇంకొందరు. మరి ఇంత ఖర్చు పెట్టిన సినిమాకు ఎంత బిజినెస్ జరగాలి అన్నది ఆసక్తికరమైన పాయింట్. ఈ విషయంలో ఢోకా ఏమీ లేదన్నది చిత్ర వర్గాల సమాచారం. ఈ చిత్రానికి మినిమం రూ.400 కోట్ల దాకా బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

‘సాహో’ హిందీ వెర్షన్‌ హక్కులు మాత్రమే రూ.120 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ‘సాహో’కు రూ.125 కోట్ల మేర బిజినెస్ జరిగిందట. అక్కడే లెక్క రూ.250 కోట్ల దగ్గరికి వెళ్లిపోయింది. ఇంకా తమిళనాడు, కర్ణాటక, కేరళ హక్కులు ఉన్నాయి. వాటి ద్వారా రూ.50 కోట్ల దాకా వచ్చి నిర్మాతల ఖాతాల్లో పడుతున్నట్లు సమాచారం.

ఇక ‘సాహో’ ఓవర్సీస్ హక్కులు రూ.40 కోట్ల మేర పలుకుతున్నట్లు సమాచారం. ఈ రకంగా థియేట్రికల్ బిజినెస్ మాత్రమే 330-340 కోట్ల మధ్య జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక నాలుగు భాషలకు కలిపి శాటిలైట్, డిజిటల్ హక్కుల అమ్మకాల్ని కలిపితే ఫిగర్ రూ.400 కోట్లను ఈజీగా దాటిపోతుంది. రూ.100 కోట్ల దాకా లాభానికి సినిమాను అమ్ముతున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. లాభాల్ని నిర్మాతలు.. ప్రభాస్ కలిసి సగం సగం వాటా పంచుకోనున్నట్లుగా తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English