బాహుబలి సెంటిమెంటును ఫాలో అయిపోయిన సాహో

బాహుబలి సెంటిమెంటును ఫాలో అయిపోయిన సాహో

ప్రభాస్ కొత్త సినిమా ‘సాహో’ను అనేక విషయాల్లో అతడి గత సినిమా ‘బాహుబలి’తో పోలుస్తున్నారు జనాలు. రెండూ జానర్లు వేరే కానీ.. స్టాండర్డ్స్, రీచ్, బడ్జెట్, కాస్టింగ్, టెక్నీషియన్స్.. ఇలా చాలా విషయాల్లో రెండూ దగ్గర దగ్గరగా కనిపిస్తాయి. ‘సాహో’ను ప్రమోట్ చేసే విషయంలో, మార్కెట్ చేయడంలో ‘బాహుబలి’ రూట్‌ను ఫాలో అవుతుండటం గమనించవచ్చు.

‘బాహుబలి’ స్థాయిలోనే భారీగా రిలీజ్ ప్లాన్స్ కూడా రెడీ చేస్తున్నారు. అంతకంటే ముందు ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ విషయంలో సెంటిమెంటుగా రామోజీ ఫిలిం సిటీని వేదికగా ఎంచుకోవడం విశేషం. ‘బాహుబలి’ కోసం ఫిలిం సిటీ ఎంట్రన్స్ దగ్గర్లో ఒక ప్రాంగణాన్ని సిద్ధం చేసి భారీ ఎత్తున వేడుక జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘సాహో’ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను సైతం ఫిలిం సిటీలోనే చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక జరగబోతోంది. ఇందుకోసం అక్కడ భారీ వేదికనే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్‌గా తెలుగు సినిమాల ఈవెంట్లు జరిగే శిల్ప కళా వేదిక, జేఆర్సీ కన్వెన్షన్ లాంటి చోట్ల ఈ వేడుక నిర్వహించడం అంటే కష్టం. జనాల్ని అదుపు చేయడం కష్టమవుతుంది. ఏదైనా స్టేడియంలో చేస్తే మరీ ఎక్కువగా జనాలు వస్తారు. అక్కడా కంట్రోల్ చేయడం కష్టమే. అందుకే మరీ ఎక్కువ జనాలు లేకుండా.. ప్రశాంతంగా వేడుక చేసుకోవడానికి ఫిలిం సిటీని వేదికగా ఎంచుకున్నారు.

ఎలాగూ బాహుబలి సెంటిమెంటు కూడా కలిసొస్తుందని భావిస్తున్నట్లున్నారు. ఈ వేడుకకు యూనిట్లోని దాదాపు అందరూ హాజరయ్యే అవకాశముంది. శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముకేశ్, జాకీష్రాఫ్, టినూ ఆనంద్.. ఇలా బాలీవుడ్ తారాగణంతో పాటు టెక్నీషియన్లందరూ వేడుకలో తళుక్కుమనే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English