ప్ర‌భాస్ పారితోష‌కం.. ఇంకా మాట్లాడుకోలేద‌ట‌

ప్ర‌భాస్ పారితోష‌కం.. ఇంకా మాట్లాడుకోలేద‌ట‌

బాహుబ‌లి సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.1800 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఆ విజ‌యంలో రాజ‌మౌళిది అత్యంత కీల‌క పాత్ర‌. మేజ‌ర్ రెమ్యూన‌రేష‌న్ ఆయ‌న‌కే ద‌క్కాలి. ప్ర‌భాస్ జ‌క్క‌న్న త‌ర్వాతి స్థానంలోనే ఉండాలి. అయితే నంబ‌ర్ ఎంత అన్నది చెప్ప‌లేదు కానీ.. ఈ సినిమాకు ప్ర‌భాస్ చాలా త‌క్కువ పారితోష‌కం తీసుకున్న‌ట్లుగా రాజ‌మౌళి స్వ‌యంగా చెప్పాడు. మ‌రి లాభాల్లో ఏమైనా వాటా ఇచ్చారో ఏమో తెలియ‌దు.

కానీ బాహుబ‌లి వ‌ల్ల ప్ర‌భాస్ రేంజ్ ఎంత పెరిగిందో.. అత‌డి మార్కెట్ ఎలా విస్త‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆ ర‌కంగా క‌లిగిన ప్ర‌యోజ‌నంతో పోలిస్తే పారితోష‌కం అన్న‌ది చిన్న విష‌యం. కాబ‌ట్టి ఈ చ‌ర్చ ఇప్పుడ‌న‌వ‌స‌రం.

ఇప్పుడు సాహో సినిమాకు ప్ర‌భాస్ ఎంత పుచ్చుకున్నాడ‌న్న‌దే ముఖ్యం. ఈ సినిమా అంత పెద్ద స్థాయికి చేరింద‌న్నా.. రూ.350 కోట్ల బ‌డ్జెట్ (అంచ‌నా) పెట్టార‌న్నా.. దాని మీద ఇంకో యాభై శాతం అద‌నంగా బిజినెస్ చేస్తోందన్నా అందులో మేజ‌ర్ క్రెడిట్ ప్ర‌భాస్‌కే చెందుతుంది. అత‌డి పేరు మీదే ఈ సినిమా సేల్ అయింది. అలాంట‌పుడు ఈ సినిమా ద్వారా అత్య‌ధిక ఆదాయం పొందాల్సింది కూడా ప్ర‌భాసే. మ‌రి ఆ మొత్తం ఎంత అన్న‌ది ఆస‌క్తిక‌రం.

ఇదే విష‌యం ప్ర‌భాస్ ద‌గ్గ‌ర ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌స్తావిస్తే.. ఈ సినిమాను నిర్మించింది త‌న మిత్రులే అని.. తాము రెమ్యూన‌రేష‌న్ గురించి ఇంకా మాట్లాడ‌లేద‌ని.. త‌మ అంద‌రి దృష్టీ ప్రేక్ష‌కుల‌కు బెస్ట్ క్వాలిటీ ఔట్ పుట్ ఇవ్వ‌డం మీదే ఉంద‌ని చెప్పాడు ప్ర‌భాస్. సినిమా రిలీజ్ త‌ర్వాత దాని గురించి ఆలోచిస్తామ‌ని కూడా చెప్పాడు. యువి క్రియేష‌న్స్ అంటే ఒక ర‌కంగా ప్ర‌భాస్ సొంత సంస్థ అనొచ్చు. కాబ‌ట్టి వ‌చ్చే లాభాలు చూసుకుని అందులో మేజ‌ర్ షేర్ ప్ర‌భాస్‌కే ఇస్తారేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English