ప‌వ‌న్ నోట జానీ, బాహుబ‌లి మాట‌

ప‌వ‌న్ నోట జానీ, బాహుబ‌లి మాట‌

రాజ‌కీయాల్లో మునిగి తేలుతూ సినిమాల్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేసిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. చాన్నాళ్ల త‌ర్వాత మ‌ళ్లీ సినిమా ముచ్చ‌ట్లు మాట్లాడాడు. జ‌న‌సేన మ‌ద్ద‌తుదారైన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్, రాజ‌కీయ విశ్లేష‌కుడు తెల‌క‌ప‌ల్లి ర‌వి రాసిన ‘మన సినిమాలు, అనుభవాలు - చరిత్ర – పరిణామం’ పుస్తకావిష్కరణలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప‌వ‌న్.. త‌న కెరీర్లో ఒకానొక‌ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచిన ‘జానీ’ గురించి.. ఇండియ‌న్ ఫిలిం హిస్ట‌రీలోనే హైయెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచిన ‘బాహుబ‌లి’ గురించి మాట్లాడ‌టం విశేషం. పుస్త‌కాల గొప్ప‌ద‌నం గురించి చెప్పే క్ర‌మంలో ప‌వ‌న్ ఈ సినిమాల్ని ఉదాహ‌ర‌ణ‌లుగా తీసుకొచ్చాడు.

సామాజిక అంశాల నేప‌థ్యంలో సినిమాలు తీసిన‌పుడు ఇతివృత్తం చెడ‌కుండానే క‌మ‌ర్షియ‌ల్ విలువ‌లు జోడించ‌డం అంత సులువు కాద‌ని ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డాడు. తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌`జానీ` సినిమా ఎందుకు ఆడలేదో అందరి కంటే త‌న‌కే బాగా తెలుసని.. కమర్షియల్ యాంగిల్‌లో పడి అనుకున్న కథను స‌రిగా తెరకెక్కించలేకపోయానని ప‌వ‌న్ చెప్పాడు.

ఒక సామాజిక సమస్యను కమర్షియల్ విలువలుతోనే మనం ప్రభావితం అయ్యేలా రాయగల స‌త్తా ప‌రుచూరి సోద‌రుల సొంత‌మ‌ని.. అలాంటి రచన శక్తి అందరికి రాదని.. తాను అక్క‌డే విఫ‌ల‌మ‌య్యాన‌ని ప‌వ‌న్ చెప్పాడు.

తెలుగు పరిశ్రమలో చాలా మంది గొప్ప స్టోరీ టెల్లర్స్ ఉన్నారని.. `బాహుబలి` కంటే ఇంకా అద్భుతమైన సినిమాలు తీయగల సాహిత్యం మన దగ్గర చాలా ఉందని చాలా మందికి తెలియదని.. అది అర్ధం చేసుకోగలిగితే ఇంకా గొప్ప సినిమాలు వస్తాయని.. తెలుగులోనే ప్రపంచాన్ని శాసించగలిగే సినిమాలు తీయగలమ‌ని.. అందుకే అంద‌రూ పుస్త‌కాల‌పై దృష్టిసారించాల‌ని ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English