సాయి ధరమ్‌ తేజ్‌ సైలెంట్‌ కిల్లర్‌!

సాయి ధరమ్‌ తేజ్‌ సైలెంట్‌ కిల్లర్‌!

సుప్రీమ్‌ టైమ్‌లో సాయి ధరమ్‌ తేజ్‌ మార్కెట్‌ దాదాపు ముప్పయ్‌ కోట్ల దగ్గరకు వెళ్లింది. వినాయక్‌తో కలిసి చేసిన ఇంటిలిజెంట్‌ చిత్రాన్ని బయ్యర్లు ఇరవై ఏడు కోట్లకి కొన్నారు. సుప్రీమ్‌ ఊపు కొనసాగినట్టయితే మిడ్‌ రేంజ్‌ హీరోలలో నాని లాంటి వాళ్లతో పోటీ పడుతూ వుండేవాడు. కానీ అదృష్టం కలిసి రాక వరుస పరాజయాలతో మార్కెట్‌ కోల్పోయాడు.

చిత్రలహరి చిత్రాన్ని పన్నెండు కోట్ల పరిధిలో మార్కెట్‌ చేస్తే స్వల్ప లాభాలతో బయటపడింది. పోయిన మార్కెట్‌ని వెంటనే తిరిగి రాబట్టుకోవాలనే ఆత్రం లేకుండా ఇప్పుడు తనకి ఎంత డిమాండ్‌ వుందో అందుకు తగ్గట్టే సాయి ధరమ్‌ తేజ్‌ సినిమాలు ఎంచుకుంటున్నాడు.

మారుతి డైరెక్షన్‌లో చేస్తోన్న 'ప్రతిరోజు పండగే' చిత్రానికి పారితోషికం పెద్దగా ఇవ్వకపోయినా కానీ తేజ్‌ కంప్లయింట్‌ ఏమీ చేయలేదు. పైగా తన రేట్‌ తగ్గిందనే వార్త ఇండస్ట్రీలో వ్యాప్తి చెందడంతో పలువురు నిర్మాతలు అతనికి అడ్వాన్సులు ఇచ్చారు.

కథల ఎంపికలో చేసిన తప్పులు రిపీట్‌ కాకుండా మినిమం గ్యారెంటీ కథలని ఎంచుకుంటున్నాడు. భారీ పారితోషికాల కోసం చూడకుండా, తన తోటి హీరోలంతా ఇప్పుడు కాస్ట్‌లీ అయిపోవడంతో తాను రెమ్యూనరేషన్‌ తగ్గించుకుని నిర్మాతలకి అందుబాటులోకి వచ్చేసాడు.

తేజ్‌తో సినిమా అంటే ఖర్చు సగానికి సగం తగ్గిపోతుందని ఇతడినే ఎక్కువ మంది ప్రిఫర్‌ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English