సాహోలో కోట్ల రూపాయలు కత్తెర పాలు

సాహోలో కోట్ల రూపాయలు కత్తెర పాలు

సాహో చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌లో రిచ్‌నెస్‌ ధగధగలాడిపోతుంది. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌కోసం నిర్మాతలు ఎన్నో రూపాయలు ధారపోసారు. అంత ఖర్చు పెట్టి తీసిన సినిమాలో ఫైనల్‌ కట్‌లోంచి దాదాపు ఇరవై నిమిషాల ఫుటేజీ తీసేయాల్సి వస్తే... ఎన్ని కోట్ల రూపాయలు కత్తెర పాలయినట్టు?
అయినా కానీ లెంగ్త్‌ ఎక్కువ అయితే ఆడియన్స్‌ బోర్‌ ఫీలవడం వల్ల సినిమాకి అంతకంటే ఎక్కువ చేటు జరుగుతుంది కనుక రన్‌ టైమ్‌ తగ్గించడం కోసం దాదాపు ఇరవై నిమిషాల నిడివి తగ్గించారు.

ఫైనల్‌ కట్‌ మూడు గంటల వరకు రావడంతో అంత రన్‌ టైమ్‌ వుంటే ల్యాగ్‌ వుందనే కామెంట్స్‌ పడతాయని, అందులోను హెవీ యాక్షన్‌ ఎపిసోడ్లు వున్నాయి కనుక అంత లెంగ్త్‌ పెడితే అదే సినిమాకి మైనస్‌ అవుతుందని పలువురు సలహాలు, సూచనలు ఇవ్వడంతో దాదాపు రెండు గంటల నలభై నిమిషాల దగ్గరకి ఫైనల్‌ రన్‌టైమ్‌ తీసుకొచ్చారు.

విశేషం ఏమిటంటే విజువల్‌ ఎఫెక్ట్స్‌ అన్నీ పూర్తి చేసుకున్న ఫైనల్‌ కట్‌లోంచి దీనిని తగ్గించారు. ఎంతో డబ్బు వృధా అయినా కానీ నిర్మాతలు దానిని లెక్క చేయలేదు. ఫైనల్‌ కట్‌ చూసిన వారు చాలా స్పీడ్‌గా వుందని ఫీడ్‌బ్యాక్‌ ఇస్తున్నారని ఇండస్ట్రీలో చెబుతున్నారు.

చాలా చిత్రాలకి డబ్బులు ఖర్చు పెట్టేసాం కాబట్టి వృధా చేయడం ఎందుకని అలాగే విడుదల చేసేసి ఆ తర్వాత పబ్లిక్‌ ఫీడ్‌బ్యాక్‌ తీసుకుని ఎడిటింగ్‌ మొదలు పెడతారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోకుండా సాహో టీమ్‌ ముందే చేతులు కాలకుండా జాగ్రత్త పడింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English