బిగ్‌బాస్‌: ఇంటికెళ్ళమ్మా శ్రీముఖీ!

బిగ్‌బాస్‌: ఇంటికెళ్ళమ్మా శ్రీముఖీ!

యాంకర్‌ శ్రీముఖి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏదో స్పెషల్‌ కంటెస్టెంట్‌లా, మిగతా వారికి లేని సెలబ్రిటీ హోదా తనకే వున్నట్టుగా బిహేవ్‌ చేస్తోంది. తనని ఎలాగో ఫైనల్స్‌కి చేర్చే బాధ్యత బిగ్‌బాస్‌ తీసుకున్నాడన్నట్టుగా ఎంత కోపం వచ్చినా తమాయించుకుని గొడవలలోకి వెళ్లకుండా చూసుకుంటోంది.

అయితే ఫిజికల్‌ టాస్క్‌లలో తనని ఎవరూ టచ్‌ చేయడానికి వీల్లేదని కండిషన్లు పెడుతోంది. ఇంతకుముందు టాస్క్‌లో కూడా తనని ఎవరైనా పట్టుకుంటే నచ్చదని శ్రీముఖి స్టేట్‌మెంట్‌ ఇచ్చింది.

మంగళవారం ఎపిసోడ్‌లో కూడా శ్రీముఖి తనని టచ్‌ చేయకూడదని రాహుల్‌ సిప్లిగంజ్‌తో చెప్పింది. మిగతా ఫిమేల్‌ కంటెస్టెంట్స్‌ స్పోర్టివ్‌గా ఆడుతోంటే శ్రీముఖి మాత్రం వుమన్‌ కార్డ్‌ ప్లే చేస్తోంది. బిగ్‌బాస్‌లో ఆడ, మగకి కలిపి ఫిజికల్‌ టాస్కులు పెడతారనేది హిందీలో అన్ని సీజన్లు చూసిన శ్రీముఖికి తెలియదా? మగాళ్లు ముట్టుకుంటారంటేనే ఒప్పుకోలేని శ్రీముఖి మరి బిగ్‌బాస్‌కి ఎందుకు వచ్చినట్టు?

ఈ ప్రశ్నలతో ఆమెని సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. ఇతర ఆడవాళ్లపై దౌర్జన్యం జరుగుతున్నా నిలబడి చోద్యం చూసే శ్రీముఖి తనదాకా వచ్చేసరికి మాత్రం ముట్టుకోవడానికి కూడా వీల్లేదని అంటోందని, ఆమెని బిగ్‌బాస్‌ త్వరగా ఇంటికి పంపేయాలని కామెంట్స్‌ పెడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English