సైరా డీల్ డ‌న్.. ఎన్ని కోట్ల‌కు?

సైరా డీల్ డ‌న్.. ఎన్ని కోట్ల‌కు?

సైరా న‌ర‌సింహారెడ్డిని పాన్ ఇండియా సినిమా చేయాల‌ని మొద‌ట్నుంచి త‌పిస్తూ ఉంది చిత్ర బృందం. ఈ చిత్రానికి అమితాబ్ బ‌చ్చ‌న్, కిచ్చా సుదీప్, విజ‌య్ సేతుప‌తి లాంటి న‌టుల్ని ఎంచుకోవ‌డం.. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అమిత్ త్రివేదిని ఎంచుకోవ‌డం ఇందుకు నిద‌ర్శ‌నం.

ఇండియాతో పాటు హాలీవుడ్ నుంచి టాప్ టెక్నీషియ‌న్ల‌ను తీసుకురావ‌డం, బ‌డ్జెట్ విష‌యంలో అస‌లేమాత్రం రాజీ ప‌డ‌క‌పోవ‌డం  కూడా ఇందులో భాగ‌మే. బాహుబ‌లి మాదిరి దీనికి దేశ‌వ్యాప్తంగా క్రేజ్ తీసుకురావాల‌నుకుంటున్నారు.

ఉత్త‌రాదిన భారీగా రిలీజ్ చేయ‌డం కోసం బాలీవుడ్లోని పెద్ద నిర్మాణ సంస్థ‌ల‌తో ముందు నుంచి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. క‌ర‌ణ్ జోహార్ రిలీజ్ చేస్తే బాగుంటుంద‌ని కూడా అనుకున్నార‌ట కానీ.. ఆయ‌న‌తో డీల్ సెట్ కాలేదు.

వేరే సంస్థ‌ల‌తోనూ చ‌ర్చ‌లు జ‌రిగాయి. చివ‌రికి ద‌ర్శ‌క నిర్మాత ఫ‌ర్హాన్ అక్త‌ర్‌కు చెందిన‌ ఎక్సెల్ ఎంట‌ర్టైన్మెంట్.. అనిల్ త‌డాని న‌డిపించే ఏఏ ఎంట‌ర్ప్రైజెస్ సంస్థ‌లు సైరాను టేక‌ప్ చేశాయి.

గ‌త ఏడాది ఈ రెండు సంస్థ‌లు కేజీఎఫ్ చిత్రాన్ని భ‌లేగా మార్కెట్ చేసి ఆ చిత్రాన్ని ఉత్త‌రాదిన కూడా పెద్ద హిట్ చేశాయి. దీంతో త‌మ సినిమాకు కూడా వీళ్లు అదే స్థాయిలో ఊపు తెస్తార‌ని ఆశిస్తున్నాడు సైరా ప్రొడ్యూస‌ర్ రామ్ చ‌ర‌ణ్‌.

ఈ డీల్ గురించి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. కాక‌పోతే ఎంత మొత్తానికి హ‌క్కులు అమ్మింది మాత్రం వెల్ల‌డించ‌లేదు. క‌ర్ణాట‌క హ‌క్కులు రూ.32 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయ‌ని గొప్ప‌గా ప్ర‌క‌టించుకున్న చిత్ర బృందం.. హిందీ డీల్ గురించి వివ‌రాలు చెప్ప‌క‌పోవ‌డాన్ని బ‌ట్టి ఆశించిన రేటు ద‌క్క‌లేద‌ని అనుకోవాలా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English