పూరి క‌ష్టాల్లో ఉంటే ఆలీ చేసిన సాయం

పూరి క‌ష్టాల్లో ఉంటే ఆలీ చేసిన సాయం

పూరి జ‌గ‌న్నాథ్ టాలీవుడ్లో ఎంతో ఎత్తుకు ఎదిగి.. అక్క‌డి నుంచి ద‌బేల్‌మ‌ని కిందికి ప‌డి.. మ‌ళ్లీ లేచి నిల‌దొక్కుకున్నాడ‌న్న సంగతి అంద‌రికీ తెలుసు.  ఒక ద‌శ‌లో ఆయ‌న త‌న ఆస్తుల‌న్నీ అమ్ముకుని న‌డి రోడ్డు మీదికి వ‌చ్చేసిన ప‌రిస్థితి. త‌న ఇల్లు, ఇత‌ర ఆస్తులే కాదు.. ఆఫీస్ సైతం అమ్ముకున్నాడు పూరి. ఆ స్థితిలో ఆలీ త‌న‌కు చేసిన సాయం, చెప్పిన ధైర్యం మ‌రువ‌లేనివంటున్నాడాయ‌న‌.

మిగ‌తా ఆస్తుల‌న్నీ అమ్మేసి.. ఇక ఆఫీస్ కూడా రాసి ఇచ్చేస్తున్న ద‌శ‌లో ఆలీ త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చాడ‌ని.. కుంకం పూసి ఉన్న బంగారు గొలుసు త‌న‌కు ఇచ్చాడ‌ని.. అది రెండు మూడు ల‌క్ష‌ల విలువుంటుంద‌ని.. దేవుడిని న‌మ్మినా న‌మ్మ‌క‌పోయినా అది త‌న ద‌గ్గ‌ర పెట్టుకోమ‌ని ఆలీ చెప్పాడ‌ని.. అది ఉంచుకుంటే పోయిన‌వ‌న్నీ తిరిగి వ‌స్తాయ‌ని అన్నాడ‌ని.. ఆలీ కోసం తాను దాన్ని త‌న త‌గ్గర పెట్టుకుంటే నిజంగానే రెండు మూడేళ్ల‌లో అన్నీ తిరిగి సంపాదించుకోగ‌లిగాన‌ని పూరి చెప్పాడు.

తాను క‌ష్టాల్లో ఉన్నా.. సుఖాల్లో ఉన్నా ఆలీ త‌న‌కు చెప్ప‌కుండానే ఇంటికి వ‌చ్చేస్తాడ‌ని.. క‌ష్టాల్లో ఉంటే ఒక పెగ్ మందు పోసి వెళ్తాడ‌ని.. సుఖాల్లో ఉంటే బొకే ఇచ్చి హ‌గ్ చేసుకుని వెళ్తాడ‌ని పూరి తెలిపాడు. త‌న ద‌ర్శ‌క‌త్వంలో ఆలీ చేసిన కామెడీ ట్రాకుల‌న్నీ సూప‌ర్ హిట్ అయ్యాయ‌ని.. తన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంక‌ర్‌లో ఆలీ లేక‌పోవ‌డంపై చాలామంది ప్ర‌శ్నించార‌ని.. కానీ మ‌ళ్లీ త‌న సినిమాలో ఆలీ నటిస్తాడ‌ని పూరి అన్నాడు.

ఆలీ హీరోగా న‌టించిన పండుగాడి ఫొటో స్టూడియో చిత్రానికి సంబంధించిన వేడుక‌లో పూరి ఈ విష‌యాల‌న్నీ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English