‘రణరంగం’ సీక్వెల్‌కి హీరో ఐడియా చెప్పాడట

‘రణరంగం’ సీక్వెల్‌కి హీరో ఐడియా చెప్పాడట

టాలీవుడ్‌కు సీక్వెల్స్ అస్స‌లు క‌లిసి రావ‌ని తెలిసినా.. హిట్టు సినిమాల‌కు కొన‌సాగింపుగా సినిమాలు తీస్తూనే ఉంటారు. తాజాగా మ‌న్మ‌థుడు స్ట‌యిల్లో మ‌న్మ‌థుడు-2 తీస్తే బోల్తా కొట్టేసింది.

అయిన‌ప్ప‌టికీ ఒక సిరీస్‌లో రెండో సినిమా తీసే ఆలోచ‌న‌లేమీ ఆగిపోలేదు. ఈ గురువార‌మే ప్రేక్ష‌కుల ముందుకు రానున్న *ర‌ణ‌రంగం* చిత్రానికి రెండో భాగం తీయ‌డానికి అప్పుడే ప్ర‌ణాళిక‌లు సిద్ధ‌మ‌య్యాయి.

కాక‌పోతే తొలి భాగం ఫ‌లితం ఎలా ఉంటుందో విశేషం ఏంటంటే.. ర‌ణ‌రంగం సీక్వెల్‌కు ఐడియా ఇచ్చింది హీరో శ‌ర్వానందేన‌ట‌. ఈ సినిమాకు సీక్వెల్ తీయాల‌న్న ఆలోచ‌న త‌న‌కు ముందు నుంచి ఉంద‌ని.. ఐతే శ‌ర్వానే దానికి ఐడియా ఇచ్చి రెండో భాగం తీద్దామ‌ని అన్నాడ‌ని.. కానీ ర‌ణ‌రంగం రిజ‌ల్ట్‌ను బ‌ట్టే ఏదైనా ఉంటుంద‌ని చెప్పాడు ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ‌.

 ర‌ణ‌రంగం సినిమాకు స్క్రీన్ ప్లే విష‌యంలో ప్రేర‌ణ గాడ్ ఫాద‌ర్-2 అనే విష‌యాన్ని కూడా సుధీర్ వెల్లడించాడు. ప్ర‌పంచంలో ఎవ‌రు గ్యాంగ్ స్ట‌ర్ సినిమా తీసినా.. అందులో గాడ్ ఫాద‌ర్ స్ఫూర్తి ఉంటుంద‌ని.. తాను కూడా అందుకు మిన‌హాయింపు కాద‌ని.. ఐతే ఈ స్క్రీన్ ప్లేను ర‌ణ‌రంగం సినిమాకు ఎంత బాగా అన్వ‌యించుకున్నామ‌న్న‌ది సినిమా చూసిన త‌ర్వాత ప్రేక్ష‌కుల‌కు తెలుస్తుంద‌ని చెప్పాడు సుధీర్.

త‌న తన‌పై క్వింట‌న్ టొరంటినో, రామ్ గోపాల్ వ‌ర్మ త‌దిత‌రుల ప్ర‌భావం చాలా ఉంద‌ని.. వాళ్ల సినిమాలు, ఐడియాల నుంచి స్ఫూర్తి పొంద‌డ‌మే కాదు.. అవ‌స‌ర‌మైతే కాపీ కూడ కొడ‌తాన‌ని సుధీర్ గ‌తంలో ఓసారి చెప్ప‌డం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English