మెగా కుర్రాడికి ఇలాంటి ఎంట్రీ.. నభూతో

మెగా కుర్రాడికి ఇలాంటి ఎంట్రీ.. నభూతో

వరుణ్ తేజ్ కెరీర్లో ఇప్పటిదాకా రకరకాల పాత్రలు చేశాడు. వాటిలో దేనికదే భిన్నంగా ఉంటుంది. కానీ అతడి సినిమాల్లో హీరో ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఊగిపోయిన దాఖలాలు దాదాపుగా లేవనే చెప్పాలి. మొదట్నుంచి ఎక్కువగా క్లాస్ టచ్ ఉన్న వైవిధ్యమైన సినిమాలే చేస్తూ సాగిపోయాడతను. తొలి సినిమాగా ‘ముకుంద’ లాంటి సాఫ్ట్ మూవీ చేయడంతో అతడి ఇమేజ్ కూడా అందుకు తగ్గట్లే బిల్డ్ అయింది.

మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసిన ‘లోఫర్’, ‘మిస్టర్’ సినిమాలు ఏమయ్యాయో తెలిసిందే. అందులో కూడా వీర లెవెల్లో మాస్ హీరోయిజం పండించిందేమీ లేదు. మిగతా సినిమాలన్నీ కొంచెం క్లాస్‌గానే సాగిపోతాయి. దీంతో వరుణ్ ఎంట్రీకి పెద్దగా బిల్డప్ ఉండేది కాదు. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ ఏమీ ఉండేది కాదు. కానీ ‘వాల్మీకి’లో మాత్రం వరుణ్ ఎంట్రీ ఓ రేంజిలో ఉండటం.. థియేటర్లు హోరెత్తిపోవడం ఖాయం.

హీరోలు కొంచెం నెగెటివ్ టచ్ ఉన్న.. రొటీన్‌కు భిన్నమైన పాత్రలు చేస్తే.. సినిమాలో లేట్ ఎంట్రీ ఇస్తే ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూడటం.. ఎంట్రీ టైంలో థియేటర్లను హోరెత్తించేయడం జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘జై లవకుశ’లో జై పాత్ర కోసం.. ‘రుద్రమదేవి’లో అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి క్యారెక్టర్ కోసం జనాలు అలాగే ఎదురు చూశారు. ఆ పాత్రలు ఎంట్రీ ఇచ్చినపుడు థియేటర్ల టాపులు లేచిపోయాయి. ఇప్పుడు ‘వాల్మీకి’లో వరుణ్ ఎంట్రీకి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తే ఆశ్చర్యమేమీ లేదు.

ఇందులో అతను చేసింది విలన్ పాత్ర కావడం విశేషం. తమిళంలో మాదిరి పూర్తిగా నెగెటివ్‌గా లేకుండా.. దర్శకుడు హరీష్ శంకర్ కొంచెం హీరో టచ్ కూడా ఇచ్చాడని అంటున్నారు. ఏదేమైనా ఈ సినిమాకు వరుణ్ పాత్ర.. అతడి అవతారం.. మేనరిజమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయడనంలో సందేహం లేదు. సినిమాకు యూఎస్పీ అయితే వరుణ్, అతడి పాత్రే. మరి ఈ పాత్రకు రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English