డబ్బు యావతో క్రేజ్‌ కోల్పోతోంది

డబ్బు యావతో క్రేజ్‌ కోల్పోతోంది

దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో సహజీవనం సాగిస్తోన్న నయనతారకి ఆల్రెడీ పెళ్లయిందని, దానిని సీక్రెట్‌గా వుంచిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా అతని అర్ధాంగి అయ్యేలోగా తనకి తమిళనాట వున్న క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవడానికి నయనతార వచ్చిన ప్రతి సినిమా ఓకే చేసేస్తోంది.

హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు వరుసగా చేస్తోన్న నయనతార ఆమధ్య మంచి చిత్రాలే చేసింది. కానీ మంది ఎక్కువయితే మజ్జిగ పలచన అన్నట్టుగా సినిమాల సంఖ్య పెరగడంతో క్వాలిటీ పడిపోయింది. దీంతో ఆమెకి వరుసగా మూడు ఫ్లాప్‌లు ఎదురయ్యాయి. తెలుగులో అయితే నయనతార అనువాద చిత్రాలకి కనీస వసూళ్లు రావడం కూడా గగనమైపోయింది. ఈ నేపథ్యంలో సైరాతో పాటు రజనీకాంత్‌, విజయ్‌ చిత్రాల మీద నయనతార ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రాలకి పెద్ద హీరోల అండ వుంది కనుక నయనతార పని సులువవుతుంది.

ఇటీవల చేసిన చిత్రాల వల్ల తగ్గిన క్రేజ్‌ మళ్లీ వీటితో తిరిగి వస్తుందని, తద్వారా మళ్లీ బిజీ కావచ్చునని చూస్తోంది. క్యాష్‌ చేసుకునే ప్రయత్నంలో క్రేజ్‌ పోగొట్టుకోవడం దేనికో ఆమెకే తెలియాలి. సమంత మాదిరిగా పెళ్లి తర్వాత కూడా క్వాలిటీ సినిమాలు చేస్తూ కోట్లు గడించే అవకాశం వుందిగా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English