మహేష్‌ని కౌంటర్‌ చేయాలంటే ఇదే కరక్ట్‌

మహేష్‌ని కౌంటర్‌ చేయాలంటే ఇదే కరక్ట్‌

మహేష్‌బాబు - అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌ అంటే అంచనాలు భారీగా వుంటాయి. అనిల్‌ రావిపూడి సినిమాల్లో కామెడీ పీక్స్‌లో వుంటుంది కాబట్టి, సంక్రాంతికి విడుదలైతే ఆ సినిమాకి ఇక అడ్డే వుండదు. ఫ్యామిలీస్‌ని ఆకర్షించే సరిలేరు నీకెవ్వరుకి పోటీగా వచ్చి సంక్రాంతికి నిలదొక్కుకోవాలంటే ఇటువైపు కూడా ఫ్యామిలీస్‌ దృష్టిని అమితంగా ఆకట్టుకునే సినిమా అయి వుండాలి.

త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్‌ చేస్తోన్న చిత్రం సంక్రాంతి బరిలో దిగడం ఖాయమైంది. ఈ చిత్రానికి వుండే బలాలకి తోడు కాంపిటీషన్‌ని తట్టుకోవాలంటే ఎలా వుండాలనే దానిపై కూడా ఈ చిత్రబృందం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. టైటిల్‌ చూడగానే ఫ్యామిలీ సినిమా అనిపించేలా, పండగకి ముందుగా ఈ చిత్రానికి రావాలని ప్రేక్షకులు భావించేలా 'వైకుంఠపురంలో' అనే టైటిల్‌కి ఫిక్సయింది.

వేరే టైటిల్స్‌ పరిశీలించినా కానీ ఈ టైటిల్‌ అయితే ఇన్‌స్టంట్‌గా కనక్ట్‌ అవుతారని, 'అత్తారింటికి దారేది' మాదిరిగా ప్రేక్షకులు ఈ టైటిల్‌తో రిలేట్‌ అవుతారని దీనికే అందరి ఓట్లు పడిపోయాయి. ఈ టైటిల్‌ని ఆగస్టు 15న లోగోతో పాటు ప్రకటించబోతున్నారు. అయితే అల్లు అర్జున్‌ లుక్‌ కూడా రివీల్‌ చేస్తారా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English